RCB Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ముందుగా మార్చి 26వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ మార్చి 28వ తేదీ నుంచి ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు మొదటి దశ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొత్తం 20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మేరకు మొదటి దశ షెడ్యూల్ ఫైనల్ చేశారు. భారతదేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తిస్థాయిలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మొదటి రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad ) మధ్య చిన్న స్వామి స్టేడియం ( Chinna Swamy Stadium) వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన ఓ అభిమాని సంచలన చాలెంజ్ విసిరింది. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోతే చార్మినార్ పై ( Charminar ) నుంచి దూకేస్తానంటూ సదరు లేడి ( RCB LAdy Fan ) వీడియో పెట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కాటేరమ్మ కొడుకులు ఉన్నప్పటికీ… బెంగళూరు మాత్రమే విజయం సాధిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆమె కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ… రాయల్ చాలెంజెస్ బెంగళూరుకు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోతే చార్మినార్ పై నుంచి దూకేస్తానని.. పాతబస్తీలో వీడియో చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. కచ్చితంగా బెంగళూరు ను హైదరాబాద్ ఓడిస్తుందని… నువ్వు చార్మినార్ పైనుంచి దూకడం గ్యారంటీ అంటున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన ప్రతిసారి ఈ లేడి ఇలాంటి వీడియోలు పెట్టి వేధిస్తుందని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చాలెంజ్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని పేర్కొంటున్నారు. ఇక ఇలాంటి వాళ్లను జైల్లో పెట్టాలని మరి కొందరు అంటున్నారు. మ్యాచ్ ఎవరు గెలిస్తే ఎవరికీ ఏం రాదని, ఇలాంటి వాళ్లను శిక్షించాలని కోరుతున్నారు.
Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..సన్ రైజర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==