E-Paper
Advertisement

BRS : బడ్జెట్ సెషన్స్ ..ఆ ఎమ్మెల్యేలకు ‘విప్’ టెన్షన్!

BRS : బడ్జెట్ సెషన్స్ ..ఆ ఎమ్మెల్యేలకు ‘విప్’ టెన్షన్!
Advertisement

రాష్ట్రంలో బడ్జెట్ సెషన్స్ ప్రారంభంకానున్నాయి.16 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు అసెంబ్లీ ముస్తాబైంది. ఈసారి బడ్జెట్ సెషన్స్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నది.సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక పద్దుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయానికి పెద్దపీట వేస్తారని చర్చ జరుగుతున్నది. ఇదిలాఉండగా,బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.మూసీ పునరుజ్జీవం, బీసీ రిజర్వేషన్లు, ఫ్యూచర్ సిటీ, గాంధీ సరోవర్ వంటి అంశాలపైనా సర్కారు చర్చ పెట్టనున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

పది మందికి క్లీన్ చిట్..

గతంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పది మందికి ప్రస్తుతం టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది.వీరు ఫిరాయింపులకు పాల్పడ్డారని, వారందరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అఫిడవిట్లు అందించిన విషయం తెలిసిందే.ఇదే వ్యవహారంలో గులాబీ పార్టీ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కాగా, ఈ వ్యవహారం స్పీకర్ వద్ద ఉన్నందున త్వరగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుదీర్ఘంగా విచారణ జరిపిన స్పీకర్.. ఆ పది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలను అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించలేదని.. దీంతో వారందరికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.

నిజంగా బీఆర్ఎస్‌లోనే ఉన్నారా?

Advertisement

స్పీకర్ విచారణ సందర్భంగా ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు అంతా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు అఫిడవిట్లు దాఖలు చేశారు. తమను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదని, తమపై క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోలేదని, విప్ కూడా జారీ చేయలేదని వారు స్పీకర్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.ఇక వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సరైన ఆధారాలు లేనందున స్పీకర్ సైతం వారికి క్లీన్ చిట్ ఇచ్చి గులాబీ ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేశారు. దీనికి తోడు ప్రతినెలా రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నదని సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. తామంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని పేర్కొన్న ఎమ్మెల్యేలు బడ్జెట్ సెషన్స్ సమయంలో ఏపార్టీకి మద్దతుగా నిలుస్తారని జోరుగా చర్చ జరుగుతున్నది.

Nandamuri Mokshagna: నారా దేవాన్ష్ పంచల ఫంక్షన్‌లో స్పాట్‌లైట్‌లో మోక్షజ్ఞ.. హీరో అవ్వాలంటే ఇంకా మారాలా?

Advertisement

అధికార పార్టీ ఏదైనా బిల్లు పెట్టినప్పుడు అది ఆమోదం పొందాలంటే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వానికి ఇప్పటికే మెజార్టీ ఉన్నది. ఎంఐఎం పార్టీ మద్దతు కూడా ఉన్నది.ఇక ప్రతిపక్షానికి మాత్రం మెజార్టీ లేదు.ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఫిరాయింపులకు పాల్పడి అధికారపక్షానికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే, ఈసారి అధికార పార్టీకి మద్దతు ఇవ్వరాదని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, నిరసన తెలపాలని విప్ జారీ చేస్తే ఆ పది మంది ఎమ్మెల్యేలు వింటారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే వీరంతా బీఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ వీరి అనర్హత పిటిషన్లను కొట్టేశారు. బీఆర్ఎస్ కూడా వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అందుకే వీరు ఇప్పుడు గులాబీ పార్టీకి మద్దతు ఇస్తారా? విప్ జారీ చేస్తే ఫాలో అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×