WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ ఐదవ మ్యాచ్ కూడా ఫినిష్ అయింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఐదవ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు వర్సెస్ యూపీ వారియర్స్ మహిళల ( Royal Challengers Bengaluru Women vs UP Warriorz Women ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట ముంబై జట్టుపై విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇవాళ యూపీ వారియర్స్ పై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Premier League 2026 Tournament ) బ్యాటర్లు అద్భుతంగా రానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఓపెనర్ గ్రేస్ హారిస్ ( Grace Harris ) రెచ్చిపోయి ఆడింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరవ ఓవర్ డాటిన్ బౌలింగ్ చేయడం జరిగింది. అయితే ఈ ఓవర్ లో ఏకంగా 32 పరుగులు పిండుకుంది గ్రేస్ హారిస్. 4,6,4,6,6,4 బాదేసి యూపీ కి చుక్కలు చూపించింది. ఇందులో రెండు ఎక్స్ ట్రాలు రావడంతో మొత్తం 32 పరుగులు సాధించింది బెంగళూరు.
అటు 22 బంతుల్లోనే గ్రేస్ హారిస్ అర్థ సెంచరీ నమోదు చేసింది. ఇందులో మూడు సిక్సర్లు అలాగే ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మొత్తంగా 40 బంతుల్లో 85 పరుగులు సాధించింది. ఈమె దాటికి 12.1 ఓవర్లలోనే యూపీపై బెంగళూరు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో యూపీ మొదట బ్యాటింగ్ చేయగా 143 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది బెంగళూరు. దీంతో తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ( Royal Challengers Bengaluru Women ).
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Women’s Premier League 2026 Tournament ) వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన బెంగుళూరు ( Royal Challengers Bengaluru Women ) నాలుగు పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ ( gujarat giants women ) రెండు విజయాలు సాధించి రెండవ స్థానంలో ఉంది. ముంబై రెండు పాయింట్లు సాధించి మూడవ స్థానంలో ఉండగా, ఢిల్లీ, యూపీ వారియర్స్ ( UP Warriorz Women ) ఆ తర్వాత స్థానంలలో వరుసగా ఉన్నాయి.
The kind of explosive madness Grace Harris displayed vs UP Warriors in the WPL? For Rizwan and Babar, it’s still a dream scenario.🤡 pic.twitter.com/tgb39id4A6
— MuFFatLal Bohra (@arshdeep3444) January 12, 2026