E-Paper
Advertisement

Amrit Bharat AC Trains: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!

Amrit Bharat AC Trains: అమృత్ భారత్ రైళ్లలోనూ ఏసీ కోచ్ లు, రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. గత దశాబ్ద కాలంగా రైల్వే సరికొత్త హంగులు అద్దుకుంటుంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే రైల్వేను మోడీ సర్కారు అత్యధునికంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రాగా, భారతీయ రైల్వే ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికాయి.   2026 నాటికి మరిన్ని రైల్వే ప్రాజెకట్టులు అందుబాటులోకి రానున్నాయి.

వందే భారత్ చైర్ కార్ రైలు మాదిరిగానే, వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను విడుదల చేయాలని రైల్వే భాస్తోంది. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. 2026 నాటికి స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. అదే సమయంలో అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను కూడా ఏసీ వెర్షన్ లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు, నమో భారత్ రైళ్లు రోజువారీ ప్రయాణీకులకు ప్రయాణ సౌకర్యాన్ని పెంచడానికి ఏసీ వెర్షన్ లో రెడీ అవుతున్నాయి. త్వరలోనే స్వదేశీ బుల్లెట్ రైలును కూడా ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.

వందే భారత్ స్లీపర్ రైళ్లు

Advertisement

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించడానికి భారతీ రైల్వే రెడీ అవుతోంది. గతంలో చైర్ కార్‌గా మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు సుదూర రాత్రి ప్రయాణాలకు మరింత అనుకూలంగా వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి, వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు, స్లీపర్ వెర్షన్‌తో ప్రయాణికులకు లగ్జరీ, సాంకేతికతను మిక్స్ చేసి సర్వీసులు అందించబోతున్నాయి.  రీసెంట్ గా వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి AC కోచ్ నమూనాను అందుబాటులోకి తీసుకొచ్చారు. కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అనే రష్యన్ సంస్థ తయారు చేసే ఈ మోడల్ ఆధునిక, ఆకర్షణీయమైన, ప్రయాణీకులకు అనుకూలమైన డిజైన్‌ ను కలిగి ఉండనుంది.

ఇంటీరియర్  ప్రత్యేకతలు  

⦿ ప్రీమియం ఫస్ట్ క్లాస్ క్యాబిన్

Advertisement

⦿ హాయిగా ఉండే సీట్లు, స్లీపర్ బెర్త్‌ లు

⦿ వాటర్ బాటిల్ హోల్డర్

⦿ రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు

⦿ ఆటోమేటిక్ డోర్లు, ఫ్లైట్ మోడల్ ఇంటీరియర్లు

⦿ ఆపరేషనల్ వేగం: 160 కిమీ/గం

⦿ గరిష్ట వేగం: 180 కిమీ/గం

⦿ ప్రయాణీకుల సామర్థ్యం: దాదాపు 1,128

అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు  

వందేభారత్ స్లీపర్ రైళ్ల కోచ్ లు క్రాష్ బఫర్లు, డిఫార్మేషన్ ట్యూబ్‌ లను కలిగి ఉంటుంది. కోచ్‌ల మధ్య ఫైర్ సేఫ్టీ వాల్స్ నిర్మించబడి ఉన్నాయి. ప్రయాణీకులు Wi-Fi, ఆధునిక స్లీపర్ బెర్త్‌ లు, ఎయిర్‌ లైన్ తరహా ఇంటీరియర్‌ను ఆస్వాదించవచ్చు. వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 కోచ్‌లను కలిగి ఉంటుంది. ఫస్ట్ AC, సెకండ్ AC (2 టైర్), థర్డ్ AC (3 టైర్) కోచ్ లను కలిగి ఉంటుంది.

సరికొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్‌

అటు అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లోనూ మార్పులు రాబోతున్నాయి. ప్రయాణీకులకు అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో AC కోచ్‌లను పరిచయం చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ 3.0 వెర్షన్ ను  రైల్వే బోర్డు ఆమోదించింది. ఈ 22 కోచ్‌ల రైలులో ఆరు సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్ కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఒక ఫస్ట్-AC, రెండు సెకండ్-AC, ఆరు థర్డ్-AC కోచ్‌లతో పాటు ఎయిర్ కండిషన్డ్ ప్యాంట్రీ కార్ కూడా ఉంటాయి.

Read Also: విశాఖపట్నం నుంచి బయల్దేరే రైళ్లు దారి మళ్లింపు, కారణం ఏంటంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×