E-Paper
Advertisement

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు
Advertisement

Robin Uthappa On Babar Azam:  పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన తోపు ఆటగాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా బాబర్ ఆజం పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఒక్కసారి ఫామ్ కోల్పోవడంతో అతని కెప్టెన్సీ, జట్టులో అవకాశం కూడా పోయింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నిలదొక్కుకున్న బాబర్ (Babar Azam)… జట్టులోకి వస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో మన శత్రువు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజంను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప (Robin Uthappa ). బాబార్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ పాక్ ప్లేయ‌ర్లే అత‌న్ని తొక్కేస్తున్నారని సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు రాబిన్ ఉతప్ప. బాబర్ ఆజం లాంటి మంచోళ్ల‌కే క‌ష్టాలు అంటూ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

బాబర్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

Advertisement

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప. వరల్డ్ క్లాసు ప్లేయర్ బాబర్ ఆజం చాలా ట్రోలింగ్ కు గురవుతున్నాడని వెల్లడించారు. బాబర్ ఆజం కెరీర్ పతనం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నట్లు రాబిన్ ఉతప్ప స్పష్టం చేశారు. కానీ అది పతనం కాదని… కావాలని కొంతమంది బాబర్ ఆజం ను తొక్కేసే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపిస్తున్నారని ఆరోపణలు చేశారు.

బాబర్ అంటే పడని వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్లోనే చాలామంది ఉన్నట్లు వెల్లడించారు. అందుకే బాబర్ ఆజం రెండు సంవత్సరాల కిందట ఫామ్ కోల్పోగానే… అతన్ని దారుణంగా ట్రోల్ చేసినట్లు తెలిపారు. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కారణంగా బాబర్ ఆజం మరింత ఒత్తిడిలోకి వెళ్లాడని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. బాబర్ ఆజంకు వ్యతిరేకంగానే పోస్టులు కనిపించాయని.. జింబాబర్ అంటూ ట్రోలింగ్ కూడా చేసినట్లు వివరించారు. దీనివల్ల బాబర్ ఆజం కూడా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినట్లు గుర్తు చేశారు. ఇలా చాలామంది వరల్డ్ క్లాసు ప్లేయర్లపై కుట్రలు జరుగుతున్నాయని… బాబర్ ఆజంకు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని తెలిపారు. మంచి వాళ్ల‌కే ఈ క‌ష్టాలు ఉంటాయ‌ని తెలిపారు.

మీడియా తప్పుడు ప్రచారమే కొంపముంచుతోంది

Advertisement

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బాబర్ ఆజం పైన విషం కక్కిందని రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఫెయిల్యూర్ అయిన సమయంలో… లైవ్ డిబేట్లు పెట్టి అతడిని కించపరుస్తూ మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడేవారని వెల్లడించారు. ఇలా ఒక్కడినే అందరూ కలిసి విలన్ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

Related News

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

దొంగ సర్టిఫికెట్స్ తో వచ్చిన వాళ్లకే జపం…ICCపై పాకిస్తాన్ ఆరోపణలు

పాక్ ఒత్తిడికి తలొగ్గిన జై షా..ICC పదవికి రాజీనామా చేయాలంటూ !

15 ఏళ్ల వైభవ్ పై అతిగా ఆశలు పెట్టుకోవద్దు…శ్రీలంక మాజీ బౌలర్ వార్నింగ్

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు

టీమిండియా గెలిస్తే చాలు, వరల్డ్ కప్ గెలిచినట్టే..పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×