E-Paper
Advertisement

నాతో పని చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేయరంటే ..సాయి రాజేష్ షాకింగ్ రివీల్!

నాతో పని చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేయరంటే ..సాయి రాజేష్ షాకింగ్ రివీల్!
Advertisement

Sai Rajesh:సాయి రాజేష్ నీలం ..ఈ పేరు చెబితే టక్కున గుర్తుపట్టలేకపోవచ్చు కాని, హృదయకాలేయం సినిమా డైరెక్టర్ అనగానే గుర్తుపట్టేవారే ఎక్కువ.ఇక ఆ తర్వాత కొబ్బరి మట్టకి,కలర్ ఫోటోకి కథలు అందించిన ఈ డైరెక్టర్ తీసిన సెకండ్ సినిమా బేబీ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు.ఇక తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ కి కథ అందించడం,అది కాస్తా సూపర్ హిట్ అవడంతో మరోసారి ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

వేరే వాళ్లకి ఇవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి ?

Advertisement

తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి రాజేష్ ని అసలు మీరు అంత ఇష్టంగా రాసుకున్న కథలని వేరే వాళ్లకి ఇవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి ?అసలు ఆ కథలని మీరే దర్శకత్వం చేయొచ్చు కదా అన్న మాటలకి రియాక్ట్ అవుతూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.తాను డైరెక్షన్ చేస్తే చాలా దగ్గరి వాళ్ళతో, తనకు సింక్ అయిన skn లాంటి వాళ్ళతోనే సినిమాలు చేస్తానని,ఇక ఆ సినిమా కోసం తన బ్లడ్ అండ్ స్వెట్ పెడతానని,అలా పూర్తిగా ఆ సినిమాలో మునిగిపోతానని అందువల్ల తనతో టార్చర్ లా ఫీల్ అయి ఒకసారి చేసిన వాళ్ళెవరు మళ్ళీ తనతో సినిమాలు రిపీట్ చేయరని, తనని ఒక రకంగా డిప్లమాటిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చేమోఅని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

also read:“అయ్యగారు” అంటూ పార్టీల్లో ఆటపట్టించేవారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్!

Advertisement

ఎప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో

ఇక తనకి కథలు రాయడమంటే ఇష్టమని, అందుకే అన్ని కథలు ఒకడినే చేయకుండా ఎక్కువ కథలని,ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఇతర దర్శకులని ఆ ప్రాజెక్ట్ లలో భాగం చేస్తుంటానని తెలిపాడు.అదే విధంగా ఇక్కడ కేవలం ఒక దర్శకత్వం మీదే ఉంటె ఏం జరుగుతుందో బాగా తెలుసని, ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదని, ఇవ్వాల ఉన్న స్టార్ డమ్ రేపు ఉండదని, అందుకే కేవలం దర్శకుడిగానే కాకుండా ఇలా మిగతా సినిమాల్ని కూడా ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్ గా పట్టాలెక్కిస్తానని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

‘కలర్ ఫోటో’ సినిమాకు నేషనల్ అవార్డ్

ఇక సాయి రాజేష్ నీలం విషయానికి వస్తే 2014లో మొదటి సారిగా ‘హృదయ కాలేయం’ని స్టీవెన్ శంకర్ పేరుతో తొలిసారి దర్శకత్వం వహించాడు సాయి రాజేష్ ,ఇక ఆ తరువాత రచయితగా 2019లో సంపూర్ణేష్ బాబు హీరోగా ‘కొబ్బరి మట్ట’ సినిమాను నిర్మించిన సాయి రాజేష్ కి 2020లో తను రచయిత,నిర్మాతగా చేసిన ‘కలర్ ఫోటో’ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకోవడం విశేషం.ఇక తాజాగా కథ అందించిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుండటంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు సాయి రాజేష్ !

also read:పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Related News

అమల అక్కినేని ‘బ్లూ క్రాస్’ ఆరంభం వెనుక నిజాలు బయటపెట్టిన అఖిల్!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. సంచలన పోస్ట్ చేసిన జ్యోతిక!

“అయ్యగారు” అంటూ పార్టీల్లో ఆటపట్టించేవారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్!

పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

కోట్లు ఉన్నా కీప్యాడ్ ఫోన్ మాత్రమే.. నోలన్ ఫోన్ వాడకపోవడానికి అసలు కారణం ఇదేనా?

లహరి షారి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ కన్నా ఎక్కువే..

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!

Big Stories

Advertisement
×