BigTV English

Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?

Rohit Sharma: అమ్మ***నా బూతులు తిడుతున్నాడు.. గవాస్కర్ పై BCCI కి రోహిత్ శర్మ ఫిర్యాదు?

Rohit Sharma: క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన చాలామంది కామెంటేటర్లుగా మారారు. వీరిలో సునీల్ గవాస్కర్, ఆకాష్ చోప్రా, రవి శాస్త్రి, హర్ష భోగ్లె, సంజయ్ మంజ్రేకర్, మైకేల్ స్లేటర్ వంటి చాలామంది మాజీ క్రికెటర్లు కామెంటేటర్లుగా మారారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ గురించి. ఎందుకంటే ఈయన తన కామెంట్రీతో స్టేడియాన్ని ఓ ఊపు ఊపేస్తారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సునీల్ గవాస్కర్ ఈ ఫీల్డ్ లో ఉంటూ ఎంతో మంది యంగ్ కామెంటేటర్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.


Also Read: Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన మొదటి సీజన్ నుండి సునీల్ గవాస్కర్ కామెంటరీ ప్యానల్ కి విశిష్ట సేవలు అందిస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ అభిమానులను తన మాటలతో, విశ్లేషణలతో అబ్బురపరుస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఈయన చేసే కామెంటరీ వివాదాలకు దారితీస్తోంది. ఐపీఎల్ 2020 సమయంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు గవాస్కర్.


అలాగే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అదే రేంజ్ లో మాటల తూటాలు పేల్చారు. రోహిత్ శర్మ ఓ నెగిటివ్ కేప్టన్ అని, అతడి కెప్టెన్సీలో పస లేదన్నారు. రోహిత్ శర్మ ఫీల్డ్ సెట్టింగ్ కూడా డిఫెన్స్ గా ఉందన్నారు సునీల్ గవాస్కర్. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో సిరీస్ మొత్తానికి రోహిత్ శర్మ దూరంగా ఉండడమే బెటర్ అని కామెంట్ చేశారు. ఇక మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా రిషబ్ పంత్ ని “స్టుపిడ్” అంటూ తిట్టిపోశారు.

ఇలా అప్పుడప్పుడు సునీల్ గవాస్కర్ చేసే కామెంట్స్ ఆటగాళ్లకు ఇబ్బందిని కలిగించడమే కాక, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. గవస్కర్ తీరు నచ్చక ఆయనపై బీసీసీఐకి రోహిత్ శర్మ కంప్లైంట్ చేశారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సమయంలో రోహిత్ శర్మ.. సునీల్ గవాస్కర్ ప్రస్తావన తీసుకువచ్చినట్లు జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ పై సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలకు అతడు చాలా ఇబ్బంది పడ్డాడని, ఈ క్రమంలోనే బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. తన ప్రదర్శన పై సునీల్ గవాస్కర్ పద్దుకు మించి మాట్లాడుతున్నారని, ఇతర క్రికెటర్ల పై కూడా ఇలానే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, ఇలా చేయడం సరైనది కాదని అన్నారట రోహిత్.

Also Read: U-19 T20WC: సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన గొంగడి త్రిష.. టీమిండియా మరో విజయం !

సునీల్ గవాస్కర్ ఇలా విమర్శలు చేయడం వల్ల ఆటగాళ్ల మైండ్ సెట్ మారిపోతుందని.. ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారట. అంతేకాదు చెప్పలేని విధంగా సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారని బీసీసీఐకి మొరపెట్టుకున్నాడట రోహిత్. సునీల్ గవాస్కర్ విమర్శలను తీవ్రంగా పరిగణించాలని కోరాడట. అయితే రోహిత్ శర్మ ఫిర్యాదుపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×