U-19 T20WC: అండర్ – 19 ఉమెన్స్ టి-20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు స్కాట్లాండ్ – భారత్ జట్ల మధ్య పదవ మ్యాచ్ జరిగింది. కౌలాలంపూర్ వేదికగా ప్రారంభమైన ఈ సూపర్ సిక్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో తెలంగాణ యువతి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. తన విధ్వంసకర బ్యాటింగ్ తో శతకం బాధింది. దీంతో అండర్ 19 మహిళల టీ-20 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించింది.
Also Read: Dhoni -RCB: పుష్ప డైలాగ్ తో RCBని ర్యాగింగ్ చేసిన ధోని..!
ఈ మ్యాచ్ లో గొంగడి త్రిష స్కాట్లాండ్ పై 53 బంతులలో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకుంది. మొత్తంగా 59 బంతులలో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 2023 జనవరిలో ఐర్లాండ్ పై ఇంగ్లాండ్ బ్యాటర్ స్క్రీవెన్స్ 93 పరుగుల రికార్డుని త్రిష అధిగమించింది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో టాప్ పర్ఫార్మర్ గా నిలిచింది. ఐదు మ్యాచ్ లలో త్రిష 53.00 సగటుతో 230 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్ లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి.కమలిని 42 బంతులలో 51 పరుగులు చేసింది. ఇందులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. ఇక వన్ డౌన్ బ్యాటర్ సనికా చల్కే 20 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో మైసీ మాసెరా ఒక వికెట్ దక్కించుకుంది. మిగతా బౌలర్లు పరుగులు సమర్పించడానికి సరిపోయారు. ఇక భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ మహిళా జట్టు కేవలం 58 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
దీంతో భారత జట్టు 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కేవలం 14 ఓవర్లలోనే స్కాట్లాండ్ ని కుప్ప కూల్చారు భారత బౌలర్లు. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 13 పరుగులకు మించి రాణించలేకపోయారు. భారత బౌలర్లలో ఆయూషీ శుక్ల నాలుగు వికెట్లతో చెలరేగింది. ఇక వైష్ణవి వర్మ, గొంగడి త్రిష చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Also Read: Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?
బ్యాట్ తోనే కాకుండా బాల్ తోను రాణించిన త్రిషకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 19 ఏళ్ల గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ తో రాణిస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే ఈ టోర్నీలో భారత జట్టుతో తలపడిన ఏ జట్టు కూడా కనీసం మూడు అంకెల స్కోర్ చేయలేకపోవడం విశేషం. ఈ ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు భీకరమైన ఫామ్ లో ఉంది.
🚨 Record Alert 🚨
Trisha Gongadi becomes the first player to score a hundred in Women's U-19 T20 World Cup history. 🇮🇳🏆#CricketTwitter pic.twitter.com/aGQlx81P4x
— Female Cricket (@imfemalecricket) January 28, 2025