BigTV English

Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

Kohli – Ranji: ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ.. స్టేడియానికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ?

Kohli – Ranji: ఇటీవల పేలువ ఫామ్ తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. దేశవాళీలలో పుష్కరకాల సుదీర్ఘ విరామానికి త్వరలో తెరదించబోతున్నాడు ఈ పరుగుల వీరుడు. ఇందులో భాగంగా రైల్వేస్ తో ఈనెల 30 నుండి ప్రారంభం కానున్న మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రోజు ఢిల్లీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు విరాట్ కోహ్లీ ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నాడు.


Also Read: Surya Kumar Yadav: మిస్టర్ 360 టీమిండియాలో ఉండి దండగ.. సూర్యపై దారుణంగా ట్రోలింగ్స్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీకి ఢిల్లీలో టైట్ సెక్యూరిటీని అమలు చేస్తున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ గ్రూప్ రన్నింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ లో పాల్గొన్నారు. అంతేకాదు మిగతా ఆటగాళ్లతో కలిసి ఫుట్ బాల్ కూడా ఆడాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మాజీ కోచ్ సంజయ్ సమక్షంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ.


దీంతో ఇప్పుడు అందరి కళ్ళు విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. అయితే ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాలని అతడిని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కోరగా.. దీనికి కోహ్లీ నిరాకరించాడు. తాను కేవలం ప్లేయర్ గానే జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ నెల 30న జరగబోయే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని చూసేందుకు స్థానిక అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడు స్టాండ్లతో అభిమానులను అనుమతిస్తున్నట్లు డిడిసిఏ తెలిపింది. ఈ మ్యాచ్ కి సీటింగ్ కెపాసిటీ పెంచడమే కాకుండా పదివేల మంది అభిమానులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పించారు. ఇక 13 ఏళ్ల తర్వాత రంజీలో కోహ్లీ ఆటని చూడాలని భావించిన ఫ్యాన్స్ ఆశలు అడియాశలు కానున్నట్లు సమాచారం. అతడు ఆడే మ్యాచ్ కి లైవ్ కవరేజి ఉండకపోవచ్చు అని క్రీడా వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ఒకవేళ బీసీసీఐ చివరి నిమిషంలో లైవ్ కవరేజీకి ఏర్పాట్లు చేస్తుందేమో వేచి చూడాలి. సాధారణంగా పెద్ద మ్యాచ్ లకు లైవ్ టెలికాస్ట్ లేదా ఓటీపీ స్ట్రీమింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో తమిళనాడుతో మ్యాచ్ నీ లైవ్ ఇచ్చిన సందర్భం ఉంది. మరో రెండు రోజుల్లో మ్యాచ్ ప్రారంభం కారుణ్య సమయంలో లైవ్ ఇవ్వడానికి అవసరమైన సిస్టం ని ఏర్పాటు చేయాలంటే కాస్త సవాల్ తో కూడిన వ్యవహారమే.

Also Read: Ambati Rayudu: BJPలోకి టీమిండియా మాజీ క్రికెటర్.. జనసేనను కాదని!

ఇక డబ్ల్యూటీసి 2025 టెస్ట్ సిరీస్ ని భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 5 టెస్ట్ లు ఆడబోతోంది. దీనికి ముందు కోహ్లీ దేశవాలి క్రికెట్ లో ఆడి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. డబ్ల్యూటీసి 2025లో విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్ ని కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×