E-Paper
Advertisement

RR VS GT Toss Controversy: రెండు సార్లు టాస్‌..ఫిక్సింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు, గిల్ సీరియ‌స్‌

RR VS GT Toss Controversy:  రెండు సార్లు టాస్‌..ఫిక్సింగ్ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు, గిల్ సీరియ‌స్‌
Advertisement

RR VS GT Toss Controversy:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతోంది. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2,) తలపడుతున్నాయి. న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎప్పుడు ఇలాగే టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, మొదట బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో ( RR VS GT Toss Controversy) వివాదం రాజుకుంది. రెండుసార్లు టాస్ వేయడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

రెండు సార్లు టాస్ వేయ‌డంపై వివాదం

Advertisement

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య టాస్ సమయంలో తీవ్ర గందర గోళ‌ పరిస్థితి నెలకొంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ కాయిన్ స్పిన్ చేశాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ హెడ్ అని చెప్పేసాడు. ఆ సమయంలో కాయిన్ టెయిల్స్ పడింది. అది తనకు వినిపించలేదని.. మళ్లీ వేయాలని రిఫరీ పేర్కొన్నాడు. అయితే తనకు వినిపించిందని… రియాన్ పరాగ్ హెడ్స్ చెప్పారని, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ సీరియస్ అయ్యాడు.

అయితే చివరకు రవి శాస్త్రి ( Ravi shastri) కల్పించుకొని మరోసారి టాస్ వెయ్యాలని కోరాడు. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ మరోసారి కాయిన్ స్పిన్ వేయడం జరిగింది.  ఈ సారి కూడా రియాన్ పరాగ్ హెడ్ అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గింది. అయితే, మొదటి టాస్ ప్రకారం గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. కానీ వివాదం రాజుకున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. దీంతో టాస్ విషయంలో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇవాళ గెలిచిన జట్టుకే ఫైనల్స్ అవకాశం

Advertisement

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్  (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2,)  మధ్య ఇవాళ జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా… గెలిచిన జట్టుకే ఫైనల్స్ అవకాశముంటుంది. ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇవాళ జరిగిన మ్యాచ్ లో గెలిచిన జట్టు.. ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది. మే 31వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ ఉంటుంది.

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×