E-Paper
Advertisement

Anti Aging: వయసు పెరిగినా అందం తగ్గదు: మార్కెట్లోకి వస్తున్న కొత్త క్రీమ్!

Anti Aging: వయసు పెరిగినా అందం తగ్గదు: మార్కెట్లోకి వస్తున్న కొత్త క్రీమ్!
Advertisement

Anti Aging: మనం చాలా పిరియాడికల్ మూవీస్‌లో చూస్తూ ఉంటాం. హీరో, విలన్‌లు ఫౌంటేన్ ఆఫ్ యూత్‌ గురించి వెతకడం.. దానిని కనిపెట్టడం.. అందులోని నీటిని తాగగానే.. వెంటనే యవ్వనంగా మారిపోవడం.. ఇదంతా కనిపిస్తుంటుంది. కానీ ఇదంతా రీల్. కానీ ఇది రియల్‌గా కూడా పాసిబుల్ అంటున్నారు సైంటిస్టులు. నిజం చెప్పాలంటే 2020లోనే దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ జరిగింది. 53 ఏళ్ల మహిళ కణాలను 23 ఏళ్ల స్థాయికి మార్చేశారు. యూకేలోని బాబ్రహమ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు ల్యాబ్‌ ట్రయల్స్‌లో ఈ ఫీట్‌ను సాధించారు. ఇప్పుడీ రీసెర్చ్‌లో మరో ముందుడుగు పడింది. గతంలో ల్యాబ్ డిష్‌లలో మాత్రమే చేసిన ఈ జెనెటిక్ రీప్రోగ్రామింగ్‌ను, ఇప్పుడు మనుషుల జీవించివున్న చర్మంపైకి సురక్షితంగా ఎలా పంపాలో సైంటిస్టులు కనిపెట్టేశారు. దీనిని సరికొత్త టాపికల్‌ mRNA కాక్‌టెయిల్ అంటే క్రీమ్, జెల్ రూపంలో దీనిని డెవలప్‌ చేసి ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. దీనిని నానో-క్యారియర్ల సహాయంతో చర్మంపై అప్లై చేసి.. చర్మ కణాల ఏజ్‌ను తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

యవ్వనంలో ఉన్నట్లే..

ఏదేమైనా వృద్ధాప్యాన్ని జయించే దిశగా పడిన ఈ అడుగు, మెడికల్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా మారబోతోంది. ఈ ట్రీట్‌మెంట్‌లో చర్మ కణాలు వాటి అసలు రూపాన్ని కోల్పోకుండా, కేవలం వాటి వయస్సును మాత్రమే రీసెట్ చేస్తున్నారు. 13 రోజుల పాటు సెల్స్‌కు కెమికల్స్‌ను అందించారు. అంటే పార్షియల్ సెల్యులార్ రీప్రోగ్రామింగ్ చేశారు. ఈ ప్రయోగం తర్వాత ఆ కణాలు 23 ఏళ్ల యువతి కణాల వలె పనిచేయడం స్టార్ట్ చేశాయి. యవ్వనంలో ఉన్నట్లే చర్మాన్ని మెరిపించే కొల్లాజెన్‌ను ఇవి విపరీతంగా ఉత్పత్తి చేశాయి. అంతేకాదు చర్మంపై అయిన గాయాలను కూడా చాలా వేగంగా నయం చేశాయి. అయితే ఇదంతా టెంపరరీ అనుకున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత చూసినా ఆ కణాలు యంగ్ గానే బిహేవ్ చేశాయి. అంటే ఇది ఒక రకమైన బయోలాజికల్ రీసెట్. ముఖానికి వేసుకునే క్రీములు, ఇంజెక్షన్ల లాంటి తాత్కాలిక సొల్యూషన్ కాదిది.

2022లో ల్యాబ్‌ టెస్ట్‌లో..

Advertisement

సో.. వెరీ సూన్‌ మన వయసు పెరుగుతుంది కానీ.. అందం తరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువ అయిపోతాయని తెలుస్తోంది. అయితే ఇదేదీ కూడా అంత ఫాస్ట్‌గా అయ్యే పని కాదు. 2022లో ల్యాబ్‌ టెస్ట్‌లో ఒక స్టెప్‌ పడగా.. సెకండ్ స్టెప్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉంది. సైంటిస్టులు కేవలం చర్మానికే పరిమితం కాకుండా.. ఈ పార్షియల్ రీప్రోగ్రామింగ్ విధానాన్ని కాలేయం, క్లోమం, రక్తంపై టెస్ట్ చేశారు. ఈ పద్ధతి ద్వారా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, కంటి శుక్లాలు, గుండె జబ్బులకు కారణమయ్యే అంతర్గత కణాల డీఎన్ఏ మార్కర్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా యంగ్‌గా మార్చేయవచ్చని తేలింది.

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

క్లినికల్ ట్రయల్స్..

Advertisement

అంతేకాదు ఈ ప్రయోగంలో వాడే యామనాక ఫ్యాక్టర్స్ వల్ల కణాలు ట్యూమర్లుగా మారే ప్రమాదం ఉండేది. కానీ రీసెంట్ టెస్ట్‌లో అలా జరగలేదు. కేవలం 13 రోజుల పాటు మాత్రమే కెమికల్స్ ఇవ్వడంతో.. కణాల ఐడెంటిటి మారలేదు.. క్యాన్సర్‌ ముప్పు కూడా రాలేదు అని చెబుతున్నారు. ఈ యాంటీ-ఏజింగ్ టెక్నాలజీని ల్యాబ్ నుండి క్లినికల్ ట్రయల్స్ వైపు తీసుకువెళ్లడానికి బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ను ఉపయోగిస్తున్నారు. వెరీ సూన్‌.. నార్మల్‌గా యూజ్‌ చేసే క్రిమ్‌ల మాదిరి మార్కెట్‌లో దొరికే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. గతంలో కూడా యాంటీ ఏజింగ్‌పై అనేక రకాల టెస్ట్‌లు జరిగాయి. సెల్యులార్ సెనెసెన్స్ అంటే.. వయసు పెరిగే కొద్దీ కొన్ని కణాలు విభజన చెందడం ఆగిపోతాయి. కానీ అవి చనిపోవు. వీటిని జాంబీ సెల్స్‌ అంటారు. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. ఈ కణాలను నాశనం చేసే సెనోలిటిక్స్ అనే మందులపై పరిశోధనలు జరుగుతున్నాయి.

రాపామైసిన్ అనే మందులు

నెక్ట్స్‌ టెలోమియర్స్.. అంటే మన DNA చివర ఉండే రక్షణ కవచాలు. వయసు పెరిగే కొద్దీ ఇవి చిన్నగా అయిపోతాయి. వీటి పొడవును పెంచడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చా అనే కోణంలో రీసెర్చ్ జరుగుతోంది. ఇక NAD+ బూస్టర్లు. అంటే మన కణాలలో శక్తి ఉత్పత్తికి, DNA రిపేర్ అవ్వడానికి NAD+ అనే కోఎంజైమ్ అవసరం. వయసుతో పాటు ఇది తగ్గుతుంది. దీన్ని పెంచడానికి NMN వంటి సప్లిమెంట్లపై తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మెట్‌ఫార్మిన్ అండ్ రాపామైసిన్. సాధారణంగా డయాబెటిస్ కోసం వాడే మెట్‌ఫార్మిన్, అలాగే రోగనిరోధక శక్తిని నియంత్రించే రాపామైసిన్ అనే మందులు జంతువులలో ఆయుష్షును పెంచినట్లు తేలింది. వీటిని మానవులపై పరీక్షించే క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇక ఆఖరి మెథడ్.. స్టెమ్ సెల్ థెరపీ. దెబ్బతిన్న కణాలను కొత్త కణాలతో భర్తీ చేయడానికి స్టెమ్ సెల్స్ ఉపయోగించే ప్రయోగాలు జరుగుతున్నాయి.

ప్రముఖ యాక్టర్..

అప్రూవ్ కానీ యాంటీ ఏజింగ్ ట్రీట్‌మెంట్స్ ప్రాణాంతకంగా మారుతాయి. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలీ జరివాలా విషయంలో అదే జరిగింది. ఉన్నట్లుండి ముంబై అంధేరీలోని తన ఇంట్లో కుప్పకూలింది.. ఆ తర్వాత ప్రాణాలు వదిలింది. ప్రముఖ యాక్టర్ కావడంతో ఆమె మరణాన్ని పోలీసులు ఈజీగా తీసుకోలేదు. ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆమె ఇంట్లో గ్లుటథియోన్, అలాగే విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ ట్యాబ్లెట్స్ గుర్తించారు. ఇవి చర్మం నిగనిగలాడేందుకు వాడే పవర్ ఫుల్ మెడిసిన్స్. వీటిని సరైన తీరులో వాడకపోవడంతోనే ఆమె మృతి చెందారని తేల్చారు.

Also read: వీటితో తక్కువ బడ్జెట్‌లో.. మీ ఇంటికి 24 గంటల సేఫ్టీ

సైడ్ ఎఫెక్ట్స్..

సరైన డైట్ లేకపోతే ఎన్ని చర్మ సౌందర్యసాధనాలు వాడినా వేస్టే అన్నది షెఫాలీ జరివాలా ఎపిసోడ్ చూస్తే అర్థమయ్యే విషయం. ఏమీ తినక ఈ వయల్స్ వాడడంతో ఒక్కసారిగా బీపీ డౌన్ అయ్యి.. కార్డియాక్ అరెస్ట్ కు దారి తీసిందంటున్నారు. షెఫాలీ యాంటీ ఏజింగ్ కోసం హార్మోనల్ థెరపీలు తీసుకుని ఉంటే అవి సైడ్ ఎఫెక్టులకు దారి తీసి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. మనిషి అందం కోసం చాలా చేస్తున్నాడు. వయసును సహజంగా కాకుండా ట్రీట్మెంట్ రూపంలో ఆపాలనుకుంటున్నాడు. అదే సమస్యలు కొని తెస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి. యాంటీ ఏజింగ్ అన్నది సహజసిద్ధంగా చేస్తేనే అందం. ఎందుకంటే అందం, ఆరోగ్యం బాగుండాలంటే.. మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవే సహజమైన ఔషధాలని నిపుణులు చెబుతున్నారు. కానీ మనిషి మాత్రం సర్జరీలు, మెడిసిన్స్ తో వయసును ఆపాలనుకుంటున్నాడు.

చర్మంలో మార్పులు..

ఈ మధ్య అందంగా కనిపించడం కోసం కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ముఖాన్ని అందంగా మార్చడానికి బోటాక్స్, ఫిల్లర్‌లు, అలాగే ఫేస్‌లిఫ్ట్ వంటి సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇవి సాధారణంగా సేఫ్ గానే చెబుతారు. అయితే ఎక్స్ పీరియన్స్ లేని డాక్టర్లు లేదా సరైన వసతులు లేని క్లినిక్‌లలో చేయించుకుంటే సమస్యలు కచ్చితంగా వస్తాయి. చర్మంలో మార్పులు జరిగి, మచ్చలు ఏర్పడి, ముఖ వైకల్యానికి దారి తీయొచ్చు. లేదా అనస్థీషియా వల్ల సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం కావచ్చు. గ్లటథియోన్ ఇంజెక్షన్లు చర్మాన్ని తెల్లగా, మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతాయి. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే కిడ్నీ, లివర్ సమస్యలు లేదా అలెర్జీ రియాక్షన్లు రావచ్చు. ఇక ముడతలను తగ్గించడానికి బోటాక్స్ ఇంజెక్షన్లు వాడతారు. కానీ ఇవి కరెక్ట్ డోస్ లో ఇవ్వకపోతే ఫేస్ లో మజిల్స్ షేప్ మారిపోతుంటాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అసలు మీ ముఖాన్ని ఎవరూ చూడని విధంగా తయారవుతుంది. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి యవ్వన రూపాన్ని కాపాడుకోవడానికి స్టెమ్ సెల్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా క్లినికల్ ట్రయల్స్‌ రూపంలోనే ఉంది.

కాస్మొటిక్ సర్జరీలు..

ఇలాంటి సర్జరీలు, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. కాస్మెటిక్ సర్జరీలైనా, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఎక్స్ పీరియెన్స్ డ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించాలి. బ్లడ్ టెస్టులు, అలెర్జీ టెస్ట్‌లు ముందుగానే చేయించుకోవడం ద్వారా శరీరం ఆ ట్రీట్మెంట్లకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఈ యాంటీ ఏజింగ్ కాస్మొటిక్ సర్జరీలు చేసుకోవాలనుకుంటే.. ఆ చికిత్సల సైడ్ ఎఫెక్టులు, ప్రాణాంతక పరిస్థితుల గురించి పూర్తి సమాచారం ముందే తెలుసుకోవడం బెటర్. ఇవన్నీ వద్దు అనుకుంటే.. సరైన డైట్, వ్యాయామం, సన్‌స్క్రీన్ వాడకం, తగినంత నీరు తాగడం, మానసిక ప్రశాంతతం ఇలాంటివి వృద్ధాప్యాన్ని త్వరగా రానివ్వవు.

Also Read: రిజర్వ్​ చేసిన తీర్పులను.. 3 నెలల్లో వెల్లడించాలి.. హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×