BigTV English

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ మామూలోడు కాదు.. అంజలి కంటే ముందే టాలీవుడ్ హీరోయిన్ సోదరితో ఎ**ఫైర్?

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్ మామూలోడు కాదు.. అంజలి కంటే ముందే టాలీవుడ్ హీరోయిన్ సోదరితో  ఎ**ఫైర్?

Sachin Tendulkar: మనదేశంలో క్రికెట్, సినిమా.. ఈ రెండు ప్రపంచాలకి ఉన్న లింక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. క్రీడాకారులు సినిమా నటుల్ని ప్రేమించడం, కొన్నిసార్లు వీరి మధ్య గాసిప్స్.. ఇలాంటి విషయాలను తరచూ వింటూనే ఉంటాం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విషయంలో కూడా గతంలో ఇలాంటి రూమర్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఎంతో గొప్ప ఆటగాడిగా నిలిచిన క్రీడాకారుల్లో సచిన్ టెండూల్కర్ ఒకరు.


Also Read: Nitish Kumar Reddy: ఏంట్రా తెలుగు సినిమాలు రీల్స్ చేసుకునే వాడిని.. టీమిండియాలోకి తీసుకువచ్చారా..?

సచిన్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. సచిన్ టెండుల్కర్ కెరియర్ పీక్ లో ఉన్న సమయం అదీ. ముఖ్యంగా అతడు వన్డేల్లో బ్యాటింగ్ కి దిగుతున్నాడు అంటేనే అంతా భయపడేవారు. జట్టు మొత్తాన్ని అవుట్ చేసినా.. అతనొక్కడే స్తంభంలా నిలబడి పరుగుల వరద పారిస్తాడు అనేది వాళ్ళ భయం. అభిమానులు కూడా భారత జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా.. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియాలకు పోటెత్తేవారు.


సచిన్ బ్యాటింగ్ సమయంలో అన్ని పనులు మానేసి టీవీలకు అతుక్కుపోయేవారు. అందుకు తగ్గట్లుగానే సచిన్ టెండూల్కర్ కూడా ఊర మాస్ బ్యాటింగ్ తో అలరించేవాడు. అలాంటి సమయంలో 90 లలో సచిన్ టెండూల్కర్ ను ఓ రూమర్ టార్గెట్ చేసింది. అంజలితో పెళ్లికి ముందే సచిన్ టెండూల్కర్ ఓ ఫేమస్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్. వీరిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారు కావడం, ఒకటి, రెండుసార్లు కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉందని పుకార్లు వినిపించాయి.

ఇలా వీరిపై కొంతకాలం పాటు పుకార్లు రావడంతో.. ఈ రూమర్స్ పై శిల్పా శిరోద్కర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ” 1991లో “హం” అనే సినిమా షూటింగ్ సమయంలో నేను మొదటిసారి సచిన్ టెండూల్కర్ ని కలిశాను. సచిన్ టెండుల్కర్ ఉండే ఏరియాలోనే మా కజిన్ కూడా ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసి క్రికెట్ బాగా ఆడేవారు. అలా నాకు సచిన్ తో పరిచయం ఏర్పడింది. కానీ మేము ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సమయంలోపే.. సచిన్ టెండుల్కర్ అంజలితో ప్రేమలో పడ్డాడు. అతడు అంజలితో ప్రేమలో ఉన్నాడన్న విషయం నాకు తెలియలేదు.

ఇక నేను హీరోయిన్.. ఆయన స్టార్ క్రికెటర్ కాబట్టి మేము ఒకసారి కలవగానే వాళ్ళు రూమర్స్ క్రియేట్ చేసి.. మా మధ్య ప్రేమ ఉందని కథనాలు రాసుకోచ్చారు. కానీ అదంతా అబద్ధం” అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇవే రూమర్స్ పై సచిన్ టెండూల్కర్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మీ గురించి మీరు విన్న చెత్త రూమర్ ఏంటి..? అని ప్రశ్నించగా.. ” అసలు శిల్ప ఎవరో నాకు తెలియదు. మా మధ్య అలాంటిదేం లేదు” అంటూ ఆ రూమర్స్ ని కొట్టిపడేశాడు.

Also Read: Mohammad Nabi Son: తండ్రి బౌలింగ్ లో కొడుకు సిక్సర్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

అయితే శిల్పా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ చెల్లి. ఈమె 90 లలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. బ్రహ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది. ఈమె యూకే బెస్ట్ బ్యాంకర్ ఆపరేష్ రంజిత్ ని పెళ్లి చేసుకుంది. వీరికి అనౌష్క అనే కూతురు ఉంది. అటు సచిన్ టెండూల్కర్ కూడా 1995 మే 24న అంజలిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఆరు సంవత్సరాల గ్యాప్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×