Nitish Kumar Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} తో వెలుగులోకి వచ్చిన టీమిండియా యంగ్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చాలా వేగంగా స్టార్ ఆటగాడు అయిపోయాడు. 2024 ఐపీఎల్ లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి.. కొన్ని నెలలకే భారత జట్టులో చోటు దక్కించుకొని సత్తా చాటాడు. గత ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కావడం, అక్కడ ఓ టెస్టులో సూపర్ సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలతో ప్రశంసలు అందుకోవడం మనందరికీ తెలిసిందే.
Also Read: Mohammad Nabi Son: తండ్రి బౌలింగ్ లో కొడుకు సిక్సర్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
ఒక్క ఇన్నింగ్స్ తోనే హాట్ టాపిక్ గా మారిపోయాడు మన తెలుగోడు. మేల్ బోర్న్ టెస్ట్ లో స్టాండింగ్ సెంచరీ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట మెరుపు సెంచరీతో అదరగొట్టాడు. బౌండరీల మీద బౌండరీలతో కంగారు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓటమి ఖాయం అనుకున్న జట్టును ఒడ్డున పడేశాడు. బాక్సింగ్ డే టేస్ట్ లో సెంచరీతో మ్యాచ్ ని మలుపు తిప్పాడు నితీష్ కుమార్ రెడ్డి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి.. 9 ఇన్నింగ్స్ లలో ఒక సెంచరీ తో 298 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లోను ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి కూడా ఎంపికై.. రెండు టెస్టుల్లో కలిపి 45 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. మూడవ టెస్ట్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి జట్టును గెలిపించడానికి కాస్త ప్రయత్నించాడు నితీష్ కుమార్ రెడ్డి.
కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ తర్వాత అవుట్ అయ్యాడు. ఈ పర్యటన నితీష్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం అనే చెప్పాలి. అయితే నితీష్ అంచనాలకు తగ్గట్లు రాణించకపోవడంతో ప్రస్తుతం అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్ట్ కి కూడా దూరమైనట్లు సమాచారం. ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన గత వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
అతడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టకముందు తెలుగు సినిమాలలోని పలు డైలాగ్స్ తో రీల్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగ్స్ తో నితీష్ కుమార్ రెడ్డి చేసిన రీల్ ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు నితీష్ కుమార్ రెడ్డిపై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ లో.. “భీమవరం బుల్స్” ఫ్రాంచైజీ కెప్టెన్ గా నియమించబడ్డాడు నితీష్ కుమార్ రెడ్డి.
Also Read: WCL 2025: అప్పుడు ధోని అవుట్.. కానీ ABD మ్యాచ్ నిలబెట్టాడు…. రన్ ఔట్ సీన్ రిపీట్
ఇతడిని భీమవరం బుల్స్ 10 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి.. ఈ పర్యటన ముగిసిన అనంతరం బుల్స్ తో జత కడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగోవ ఎడిషన్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఇక అదే నెల 24న ఫైనల్ తో ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి {ACA-VDCA} స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్ లో {APL} ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగుతుంది.
?utm_source=ig_web_copy_link