BigTV English

Balakrishna Akhanda2: అఖండ2 షూటింగ్ లోకేషన్ వీడియో… నదిలో బాలయ్య యాక్షన్!

Balakrishna Akhanda2: అఖండ2 షూటింగ్ లోకేషన్ వీడియో… నదిలో బాలయ్య యాక్షన్!

Balakrishna Akhanda2:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna )హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) కలయికలో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా బాలయ్య కెరియర్ లో తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా హల్చల్ చేస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్.. మోతుగూడెంలో జరుగుతోంది. ఇక్కడ అఘోర గెటప్ లో బాలయ్య అలాగే డూప్ హీరోయిన్ కలిసి నటిస్తున్నారు. ఇక ఇక్కడ అంత నీటి ప్రవాహంలో కూడా బాలయ్య డూప్ లేకుండా నదిలోకి దిగి అస్తికలు నదిలో కలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ పాట అయితే ఏకంగా గూస్బంస్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.. మొత్తానికైతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగు నిర్విరామంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా అంతటి నదీ ప్రవాహంలో కూడా బాలయ్య డూప్ లేకుండా నదిలోకి దిగి ఆస్తికలు కలిపిన వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ట్రెండింగ్ లో నిలిచిన అఖండ 2 టీజర్..


ఇక అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తూ ఉండగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోనే 24 మిలియన్ కి పైగా వ్యూస్, 5.9 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది ఈ టీజర్. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

గూస్ బంప్స్ తెప్పించిన టీజర్ డైలాగ్స్..

ఇకపోతే ఈ టీజర్ విడుదల అయినప్పుడు అందులోని డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. “నా శివుడి అనుమతి లేనిదే.. ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా ?అమాయకుల ప్రాణాలు తీస్తావా?” అంటూ ఉగ్రరూపం దాల్చిన అఘోర పాత్రలో బాలయ్య చెప్పే డైలాగ్స్ భారీగా పేలిపోయాయి. త్రిశూలంతో హిమగిరిలో శత్రువులను సంహరించిన తీరు, తమన్ అందించిన బీజీఎం రెండు విశేషంగా ఆకట్టుకున్నాయి.

అఖండ 2 నటీనటులు..

ఇక అఖండ 2021లో వచ్చి మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా అఖండ 2 తాండవం తెరకెక్కుతోంది. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రత్యేకంగా భాగమవుతున్నారు. తొలి భాగంలో నటించిన జగపతి బాబుతో పాటు పలువురు నటీనటులు ఇందులో కూడా కనిపించనున్నారు.

ALSO READ:HBD Suriya: సేల్స్ బాయ్ నుండి స్టార్ హీరో స్థాయికి..అటు జ్యోతికతో పెళ్లి.. ఊహించని ట్విస్టులెన్నో!

 

Related News

Pawan Kalyan: చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్..పెద్దన్నయ్య అంటూ!

OG Movie: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్.. అక్కడ షో క్యాన్సిల్!

Vithika-Varu Sandesh: సొంతింటి కలను నెరవేర్చుకున్న వితిక దంపతులు..ఫోటోలు వైరల్!

‎OG Censor : ‘ఓజీ’ ఇట్స్ A సర్టిఫికేట్ మూవీ… అయినా రెండు నిమిషాలు కట్ చేశారు

Dharma Wife: రాత్రిళ్ళు మాత్రమే ఫ్లాట్‌కి వస్తుంది.. క్యారెక్టర్ లేదా? రీతు చౌదరిపై ధర్మా భార్య గౌతమి ఫైర్!

‎Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్‌ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

Big Stories

×