Pune News: వారిద్దరు భార్యభర్తలు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక డబ్బులు కొదవలేదు. కాకపోతే ఏదో సంపాదించాలన్న ఆశ. చివరకు భార్యని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరకు భార్య బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.
మహారాష్ట్ర పూణె సిటీలోని అంబేగావ్ ప్రాంతంలో ఇద్దరు భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఇల్లు, కార్లు కొన్నాడు ఆమె భర్త. ఈఎంఐల భారం భర్త నెత్తి మీద పడింది. ఇద్దరి మధ్య చిన్నచిన్న తగాదాలు లేకపోలేదు.
భార్య నుంచి ఎలాగైన డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశాడు ఆమె భర్త. నార్మల్‌గా డబ్బులు అడిగితే ఇవ్వడం లేదని భావించాడు అతడు. ఇంట్లో భార్య స్నానం చేస్తుండగా రహస్య కెమెరాలతో వీడియోలు చిత్రీకరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలు బయట పెడతానంటూ భార్యని బ్లాక్ మెయిల్ చేశాడు.
ఈ తతంగం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలీదు. భర్త ఆగడాలకు రోజు రోజుకు శృతి మించడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యభర్తల మధ్య అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమకు పెళ్లి జరిగి ఐదేళ్లు అయ్యిందని ప్రస్తావించింది బాధిత భార్య.
ALSO READ: గాళ్స్ హాస్టల్‌లో దారుణం.. వార్డెన్ కొడుకు అరాచకం
కారు, ఇంటి ఈఎంఐ కట్టేందుకు పుట్టింటి నుంచి లక్షన్నర డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది. డబ్బులు తీసురాకుంటే వీడియోలు బయట పెడతానని బెదిరిస్తున్నారని రాసుకొచ్చింది. శారీరకంగా, మానసికంగా నిత్యం వేధిస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసింది ఆ ఇల్లాలు.
అంతేకాదు భర్త కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు పెరుగుతున్నట్లు వివరించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.