E-Paper
Advertisement

రెండోసారి సాయి సుద‌ర్శ‌న్ హిట్ వికెట్..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన గిల్

రెండోసారి సాయి సుద‌ర్శ‌న్ హిట్ వికెట్..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన గిల్
Advertisement

Sai Sudharsan Hit-wicket:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి అంకానికి చేరుకుంది. నిన్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగగా.. రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకువెళ్లింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans). రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ( Rajasthan Royals) ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా మరోసారి గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ( Sai Sudharsan Hit-Wicket) హిట్ వికెట్ అయ్యాడు. 58 పరుగులు చేసిన సాయి సుదర్శన్, మొన్న క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో బ్యాట్ వదిలేసి హిట్ వికెట్ కాగా, నిన్నటి మ్యాచ్ లో కూడా అచ్చం అలాగే వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆ సమయంలో మరోవైపు ఉన్న కెప్టెన్ గిల్ ( Shubman Gill), తల పట్టుకున్నాడు. ఒరేయ్ మళ్లీ అలాగే ఔట్ అయ్యావా? అంటూ తల బాదుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

ఫైనల్స్ కు దూసుకు వెళ్లిన గుజరాత్ టైటాన్స్

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శుక్రవారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 215 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది రాజస్థాన్. ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది గుజరాత్. గిల్ సెంచరీ చేయగా, సాయి సుదర్శన్ అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు.

దురదృష్టవశాత్తు సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయ్యాడు తప్ప… అతడు వికెట్ సమర్పించుకోకపోతే.. వికెట్ నష్టపోకుండా మ్యాచ్ గెలిచేది. అతడు తొందరగానే వికెట్ సమర్పించుకున్న నేపథ్యంలో… 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి, ఫైనల్ కి వెళ్ళింది గుజరాత్ టైటాన్స్. ఇక మే 31వ తేదీన అంటే రేపు ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది.

ఫైనల్స్ లో సాయి సుదర్శన్ హిట్ వికెట్ కాకుండా చూస్తా – గిల్

Advertisement

వరుసగా రెండుసార్లు సాయి సుదర్శన్ హిట్ వికెట్ కావడం దురదృష్టకరం అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఫైనల్స్ లో మాత్రం సాయి సుదర్శన్ అలా ఔట్ కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీంతో గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

 

 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×