MS Dhoni: టీమిండియా స్టార్ క్రికెటర్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని తనదైన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలను అందించాడు. ధోని గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు అని అనుకునేవారు ఎందరో ఉన్నారు. ధోనీ చేతిలో ఇతర జట్లు ఎన్నోసార్లు ఘోర పరాజయం చవిచూశాయి. ధోని తన కెరీర్ లో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. అంతేకాకుండా ఇండియాకు టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను తీసుకువచ్చాడు. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు సార్లు ట్రోఫీలను తీసుకువచ్చాడు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోని టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం ధోని ఐపీఎల్ మ్యాచ్లను మాత్రమే ఆడుతున్నాడు. ధోని తన కెరీర్ లో ఎన్నో మ్యాచ్లు ఆడి భారీ విజయాలతో పాటు మంచి గుర్తింపును, గొప్ప పేరును, భారీగా డబ్బులను కూడా సంపాదించాడు. ఇక ధోనికి విపరీతంగా కార్లు, బైకులు, వాచ్ లు, భవనాలు ఉన్నాయి.
ఇక ధోని వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఇతను సాక్షి సింగ్ అనే అమ్మాయిని ప్రేమించి 2010 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ధోని సాక్షి ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇక 2015 సంవత్సరంలో వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ అమ్మాయికి జీవా సింగ్ ధోని అనే పేరు పెట్టారు. ఈ అమ్మాయి ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు. అయితే వీరికి అమ్మాయి జన్మించి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మరో బిడ్డకు జన్మనివ్వలేదు. ఈ క్రమంలోనే సాక్షి సింగ్ తనకు కుమారుడు కావాలని ధోనిని అడుగుతున్నట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో ఓ మీమ్ క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పాట్ కమిన్స్, హెడ్ లకు కుమారుడు ఉన్నాడని నాకు కూడా ఓ కుమారుడు కావాలి అంటూ సాక్షి సింగ్ గొడవ చేస్తుందట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన అనంతరం కొంతమందిని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ధోని మీద కావాలనే కక్షతో ఇలా మీమ్ లను క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. మరి కొంతమంది సాక్షి సింగ్ నిజంగానే ధోనీని ఇలా అడుగుతుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మీమ్ చూసిన అనంతరం ధోని అభిమానులు మాకు కూడా చిన్నధోని కావాలి అని కామెంట్లు చేస్తున్నారు. మీకు కుమారుడు పుడితే అతను కూడా మంచి క్రికెటర్ అవ్వాలని అంటున్నారు.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
?igsh=bXJsMHF2eXViM2Q1