Team India Jersy: ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బురదతో ఉన్న టీమిండియా జెర్సీ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అలాగే ఫేస్ బుక్ ఇలా ఎక్కడ చూసినా బురదతో ఉన్న టీమ్ ఇండియా జెర్సీ దర్శనమిస్తోంది. అయితే ఈ బురదతో ఉన్న టీమిండియా జెర్సీ వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఆ జెర్సీ ధరించింది గౌతమ్ గంభీర్. టీమిండియా ఓపెనర్ గా అతడు జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అలాంటి గౌతమ్ గంభీర్ 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 97 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ ధరించిన జెర్సీని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
ఉదయం నుంచి వైరల్ అవుతున్న బురద పట్టిన జెర్సీ గౌతమ్ గంభీర్ ది (Gautam Gambhir ). 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో గౌతమ్ గంభీర్ ఈ జెర్సీనే ధరించాడు. అంతేకాదు అతడి అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా ఛాంపియన్ అయింది. 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో ఫైనల్ లో శ్రీలంక వర్సెస్ టీం ఇండియా మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా టీమిండియా ఛేజింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50 ఓవర్స్ లో ఆరు వికెట్లు నష్టపోయి 274 పరుగులు చేసింది. అప్పటి స్టార్ క్రికెటర్, కెప్టెన్ జయవర్ధనే 103 పరుగులు చేసి దుమ్ము లేపాడు.
ఇక చేజింగ్ లో టీమిండియా మొదట తడబడింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డక్ అవుట్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ 18 పరుగులకే వెనుతిరిగాడు. అలాంటి సమయంలో మొదటి వికెట్ కు బ్యాటింగ్ చేసిన గౌతమ్ గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేశాడు. కీలకమైన ఇన్నింగ్స్ లో మంచి భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియా కు విజయాన్ని అందించాడు. అయితే ఈ 97 పరుగులు చేసే క్రమంలో రన్ అవుట్ కోసం ప్రయత్నించి డైవ్ కూడా చేశాడు. అప్పుడే జెర్సీకి మట్టితో కూడుకున్న బురద అంటింది. ఆ మరకే ఇప్పుడు చరిత్ర అయింది. అయితే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir Jersy ) ఈ మ్యాచ్ లో 97 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో రఫ్ ఆడించాడు. ముఖ్యంగా చివరి బంతికి సిక్సర్ కొట్టి క్రెడిట్ మొత్తం తన వైపుకు మహేంద్రసింగ్ ధోని లాగేసుకున్నాడు అని విమర్శలు కూడా ఇప్పటికీ వస్తున్నాయి. కాగా ఇవాళ గంభీర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ జెర్సీనీ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
Here's wishing Gautam Gambhir a very Happy Birthday 🎂🥳 pic.twitter.com/ZMe6UnTDQk
— Mumbai Indians (@mipaltan) October 14, 2025