Neeraja Kona : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ప్రస్తుత కాలంలో నందిని రెడ్డి తప్ప ఎవరి పేరు వినిపించదు. ఈ తరుణంలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నీరజకోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా మారిన విషయం తెలిసిందే. తెలుసు కదా అనే సాఫ్ట్ టైటిల్ చూసి ఈ సినిమా కూడా ఒక స్లో నెరేషన్లో ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్రైజేషన్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.
దీపావళి కానుకగా తెలుసు కదా సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. సినిమాకి సంబంధించిన ఆల్బమ్ కూడా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకురాలుగా నీరజ కోన కు మంచి గుర్తింపు దక్కుతుంది. చాలామంది యూత్ కి కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ పర్ఫెక్ట్ గా కట్ చేశారు అని చెప్పాలి.
నీరజ కోన చేసిన తెలుసు కదా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే, ఆల్రెడీ రెండో హీరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితేనే. నితిన్ హీరోగా నీరజకోన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు విశ్వసినీయా వర్గాల సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇవన్నీ జరగాలి అంటే ముందు తెలుసు కదా సినిమా సక్సెస్ అవ్వాలి.
మరోవైపు నితిన్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. వాస్తవానికి నితిన్ పడుతున్న కష్టంలో ఎటువంటి లోపం లేదు. కానీ ఎంచుకున్న కథల్లోనే ప్రాబ్లం అంతా జరుగుతుంది. ఇవన్నీ గ్రహించి నితిన్ తన నెక్స్ట్ అడుగు ఎలా వేస్తాడు తనకే తెలియాలి.
అతి తక్కువ బడ్జెట్ తో చేసిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి విపరీతంగా వచ్చాయి. ఈ తరుణంలో హీరో నితిన్ ఈ సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ చెప్పిన కథను లేటెస్ట్ గా విన్నారు. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. అన్ని ఫైనల్ అయిపోతే సాయి మార్తాండ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేసే అవకాశం ఉంది.
బహుశా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత అక్కడ తెలుసు కదా సినిమా హిట్ అయిపోతే నీరజకోన దర్శకత్వంలో నితిన్ సినిమా చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహగానాలు వినిపిస్తున్నాయి. అలానే నితిన్ కి మరియు నీరజకోనకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: Mithra Mandali: విషయం వీక్ గా ఉన్నప్పుడే, పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది