PEDDI : బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు టాలెంట్ మొదటి సినిమాకే చాలామందికి అర్థం అయిపోయింది. కొత్త హీరోతో 100 కోట్లు మార్కెట్లోకి చేరిపోయాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా బుచ్చి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. నేను వీడిని మాత్రమే శిష్యుడు అని ఫీల్ అవుతాను అని పలు సందర్భాల్లో అన్నారు. ఎందుకంటే నేను వీడికి లెక్కలు కూడా చెప్పాను అని చెప్పారు.
బుచ్చిబాబు ఉప్పెన కథను సుకుమార్ కు చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యారట. అయితే ఆ ప్రాజెక్టు కూడా దగ్గరుండి అన్ని విధాల జరిగేలా చూశారు సుకుమార్. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ప్రాజెక్టు కూడా దగ్గరుండి సుకుమార్ జరిపించింది. ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం వచ్చాడు అంటే బుచ్చిబాబు ఏ రేంజ్ లో కథ సిద్ధం చేశాడు ఆలోచించాల్సిందే.
పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్ విడుదల అయిపోయింది. అది చూసిన వెంటనే చాలామందికి సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ మాట్లాడిన విధానం విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. మొత్తానికి దీని గురించి అఫీషియల్ అప్డేట్ బుచ్చిబాబు ఇచ్చాడు. పెద్ది మొదటి సాంగ్ గురించి మాట్లాడుతూ.. లవ్ సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తున్నాము. ఏఆర్ రెహమాన్ గారు చితకొట్టేశారు సాంగ్. చాలా బాగా వచ్చిందండి అని డ్యూడ్ సినిమా ఈవెంట్ లో తెలిపాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ అప్డేట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంత మాట్లాడినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. వాస్తవానికి ఆయన సంగీతం గురించి మాట్లాడే శక్తి, స్థాయి, అర్హత చాలా మందికి ఉండవని చెప్పాలి.
చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకి ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు అంటే ఎటువంటి సంగీతాన్ని అందిస్తారు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. తన సంగీతంతో సన్నివేశాలకు ప్రాణం పోయడం అనేది ఏఆర్ రెహమాన్ కి పెద్ద పని కాదు. అయితే ఎటువంటి సన్నివేశాలు బుచ్చి క్రియేట్ చేశాడో చూడాలి. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో రంగస్థలం అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read: Fauji : ప్రభాస్ సినిమా టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి