E-Paper
Advertisement

Salman Ali Agha: అభిషేక్ శర్మను డకౌట్ చేస్తాం..సూర్య కుమార్ ముందే తొడ కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్

Salman Ali Agha: అభిషేక్ శర్మను డకౌట్ చేస్తాం..సూర్య కుమార్ ముందే తొడ కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్
Advertisement

Salman Ali Agha:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. రేపు కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo) వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ కెప్టెన్లు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రేపటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడతాడని, అతడు ఆడితే డకౌట్ చేస్తామంటూ విర్ర‌వీగాడు సల్మాన్ అలీ అఘా. అది కూడా టీమిoడియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు సల్మాన్ అలీ అఘా. దీంతో సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

సూర్య కుమార్ ముందే తొడ కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరి కొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. రేపు రాత్రి 7 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) ఇద్దరు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్ లో ఆడడంపై జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రియాక్ట్ అయ్యారు. తనకు అందిన సమాచారం ప్రకారం అభిషేక్ శర్మ ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. ఈ లెక్కన రేపు పాకిస్తాన్ తో అభిషేక్ శర్మ ఆడతాడని కూడా ఆ సల్మాన్ స్పష్టం చేశారు. అయితే అభిషేక్ శర్మను ఎలా అవుట్ చేయాలో ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. అభిషేక్ శర్మను కచ్చితంగా డక్ ఔట్ చేస్తామని కూడా ప్రకటించాడు. దీంతో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక అటు దీనిపై సూర్య కుమార్ యాద‌వ్ స్పందించారు. పాకిస్తాన్ అంత‌లా ఆశ‌ప‌డితే, క‌చ్చితంగా అభిషేక్ శ‌ర్మ‌ను ఆడిస్తామ‌ని ప్ర‌క‌టించారు సూర్య భాయ్‌. రేప‌టి మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ ఆడ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక సూర్య కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో టీమిండియా ఫ్యాన్స్ సంబ‌ర ప‌డిపోతున్నారు.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

Team India Playing IX

Advertisement

1. అభిషేక్ శర్మ
2. ఇషాన్ కిషన్
3. తిలక్ వర్మ
4. సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్‌)
5. హార్దిక్ పాండ్యా
6. అక్షర్ పటేల్ (VC)
7. శివం దుబే
8. రింకు సింగ్
9. జస్ప్రీత్ బుమ్రా
10. వరుణ్ చక్రవర్తి
11. కుల్దీప్ యాదవ్

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×