E-Paper
Advertisement

Sana Javed : షోయబ్ మాలిక్ మూడో భార్య ఎవరో తెలుసా?.. సానియా మీర్జా సవతి గురించి ఆసక్తికర విషయాలు!

Sana Javed : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ పాకిస్తాన్ ప్రముఖ సినీ నటి అయిన సనా జావేద్ ని వివాహం చేసుకున్నాడు. అయితే సనా జావేద్ కోసం నెటిజన్లు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు. సనా జావేద్ మార్చి 25న 1993న సౌదీ అరేబియాలో జెడ్డాలో జన్మించింది. అయితే ఆమె పూర్వీకులు హైదరాబాద్‌కి చెందిన వారు అవ్వడం విశేషం. దేశ విభజన సమయంలో ఇండియాని వదిలి పాకిస్థాన్‌కి వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిరపడ్డారు. సనా తండ్రి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.

Sana Javed :  షోయబ్ మాలిక్ మూడో భార్య ఎవరో తెలుసా?.. సానియా మీర్జా సవతి గురించి ఆసక్తికర విషయాలు!

Sana Javed : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సినీ, టివి సీరియల్ నటి అయిన సనా జావేద్‌ని షోయెబ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే సనా జావేద్ కోసం నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతున్నారు.

సనా జావేద్ మార్చి 25న 1993న సౌదీ అరేబియాలో జెద్దాలో జన్మించింది. అయితే ఆమె పూర్వీకులు భారత్ దేశం.. హైదరాబాద్‌కి చెందిన వారు కావడం విశేషం. దేశ విభజన సమయంలో ఇండియాని వదిలి పాకిస్తాన్ వెళ్లిపోయారు. వారంతా అక్కడే స్థిరపడ్డారు. సనా తండ్రి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.

వ్యాపార వేత్త కావడంతో ఆమె కుటుంబం జెద్దా వెళ్లిపోయింది. అక్కడే ఆమె జన్మిచింది. ఆ తర్వాత కుటుంబం లాహోర్ కు వచ్చేసింది. సనా జావేద్ ఉర్దూ టెలివిజన్‌లో పని చేస్తోంది. ‘షెహర్-ఇ-జాత్’ అనే రొమాంటిక్ సీరియల్‌తో నటన రంగంలోకి ప్రవేశించింది. ఆ సీరియల్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఖానీ అనే సీరియల్ చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు ఆమె పాతిక సీరియళ్లలో నటించింది. ఆమె నటించిన ‘రుస్వాయి’ సీరియల్ పాత్రకు ఉత్తమ నటి(క్రిటిక్స్)గా పీసా, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.

ఆ తర్వాత ‘బెహద్’, ‘షరీక్-ఇ- హయత్’, ‘డినో కి దుల్హనియా’ , ‘ఐ లవ్ యూ జరా’ వంటి టెలీ ఫీల్మ్స్ లోను నటించి ప్రేక్షకుల మదిని దోచేసింది. క్రమంగా సీరియళ్లలోనే కాదు, సీనిమాల్లోకి సనా ప్రవేశించింది. సోషియా కామెడీ ఫీల్మ్ మెహరున్సీసా ‘we lub u’ లో నటించింది. ఈ సీనిమా 2017 లో విడుదల అయింది. పాకిస్థాన్ సినీ నటుడు, గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను 2020 అక్టోబర్‌లో సనా వివాహం చేసుకుంది. అయితే 2023లో వారిద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ పరిచయం అయ్యాడు. వీరిద్దరు కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గోనడంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఏడాది సనా బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోను షేర్ చేస్తూ షోయబ్ హ్యాపీ బర్తడే బడ్డీ అంటూ పోస్ట్ పెట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. చివరికి వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన సామాజిక మాధ్యమ ఖాతాల పేరును ‘సనా షోయాబ్ మాలిక్’ గా మార్చుకుంది.

మరోవైపు షోయెబ్ మాలిక్ రెండో భార్య అయిన ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్తతో ఖులా పద్దతిన విడాకులు తీసుకున్నారని ఆమె తండ్రి మీడియా ముందు తెలిపారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×