Yuvraj Singh – Sanju: టీమిండియా కుర్ర క్రికెటర్లకు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ వీరుల్లాగా తయారు చేస్తున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh). ఇప్పటికే అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ లాంటి ప్లేయర్లను టీమిండియాకు రెడీ చేసి ఇచ్చాడు యువరాజ్ సింగ్. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో రాటుదేలిన ఈ ఇద్దరు కుర్రాళ్ళు, ఇప్పుడు టీమిండియాను ఏలుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో క్రికెటర్ ను యువరాజ్ సింగ్ తయారు చేస్తున్నట్లు వీడియో బయటకు వచ్చింది. ఆ క్రికెటర్ ఎవరో కాదు , టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ ( Sanju Samson ). టీమిండియా టి20 జట్టులో మాత్రమే స్థానం దక్కించుకుంటోన్న సంజు శాంసన్, ఇప్పుడు యువరాజు సింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఎప్పుడు వైరల్ గా మారింది. దీంతో సంజు శాంసన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక సంజు శాంసన్ ను ఎవడూ ఆపలేరని అంటున్నారు.
టీమిండియాలో యంగ్ క్రికెటర్లను తయారు చేసే పని పెట్టుకున్నాడు యువరాజ్ సింగ్. గతంలో టీమిండియాను మహేంద్రసింగ్ ధోని గాడిలో పెట్టగా… ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత యువరాజ్ సింగ్, తనకంటూ ఒక స్టైల్ ఫిక్స్ చేసుకున్నాడు. టీమిండియా కుర్ర క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాడు. ఇక యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్క క్రికెటర్, భయంకరంగా ఆడుతున్నారు. దానికి నిదర్శనమే గిల్ అలాగే అభిషేక్ శర్మ. ఇందులో అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగే అభిషేక్ శర్మ, కాటేరమ్మ కొడుకుగా మారిపోయాడు. గ్రౌండ్లో అడుగుపెట్టిన నుంచి అవుట్ అయ్యేవరకు సిక్సర్ లేదా బౌండరీ. ఇదే పని పెట్టుకున్నాడు. అలా అభిషేక్ శర్మ సక్సెస్ కావడం వెనుక యువరాజ్ సింగ్ కష్టం ఉంది. అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ అలాగే గిల్ ను ట్రైన్ చేసినట్లుగానే సంజు శాంసన్ వెంటపడుతున్నాడు యువరాజ్ సింగ్. త్వరలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో… సంజు శాంసన్ కు మెలికలు నేర్పిస్తున్నాడు యువరాజ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
టీమిండియాలో సంజు శాంసన్ కు అడపాదడప చాన్సులు మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అయితే యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో అతనికి వరుసగా అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ఇక టీమిండియాలో సంజు శాంసన్ శకం ప్రారంభం కాబోతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. గిల్అ లాగే అభిషేక్ శర్మ కూడా యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ అయి ఇప్పుడు టీమిండియాను ఏలుతున్నారు. నెక్స్ట్ సంజు టైం ప్రారంభం కాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. మరి యువరాజ్ సింగ్ ఇచ్చిన ట్రైనింగ్ ను సంజు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిలక్ వర్మకు ఘోర అవమానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?
Sanju Samson training session with Yuvraj Singh ❤️🔥@YUVSTRONG12 @IamSanjuSamson pic.twitter.com/gBc04dbKXs
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) January 10, 2026