E-Paper
Advertisement

Nadine de Klerk: చివ‌రి ఓవ‌ర్ లో 6,4,6,4.. RCBలో మ‌రో ఏబీ డివిలీయర్స్..ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Nadine de Klerk: చివ‌రి ఓవ‌ర్ లో 6,4,6,4.. RCBలో మ‌రో ఏబీ డివిలీయర్స్..ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
Advertisement

Nadine de Klerk:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 )  నిన్న ప్రారంభం కాగా, తొలి మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబై ఇండియన్స్ జట్టుపై ఏకంగా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది RCB. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో బోనీ కొట్టింది. బెంగళూరుకు చెందిన నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుతంగా రానించడంతో బెంగళూరు విజయం సాధించింది.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

చివరి ఓవర్ లో చుక్కలు చూపించిన లేడీ ఏబీ డివీలియ‌ర్స్‌

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women)  మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) ఏబీ డివిలీయర్స్ తరహాలో అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో 44 బంతులు ఎదుర్కొన్న నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk) 63 పరుగులు చేసింది. ఇందులో రెండు సిక్సులతో పాటు ఏడు బౌండరీలు ఉన్నాయి. 143 స్ట్రైక్ గ్రేడ్ తో అదరగొట్టింది. ముఖ్యంగా చివరి ఓవర్ లో నాలుగు బంతులకు 18 పరుగులు కావాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో బెంగళూరు ప్లేయర్ నాడిన్ డి క్లర్క్ (Nadine de Klerk), ముంబై కి చుక్కలు చూపించింది. 6,4,6,4 వరుసగా బాదింది నాడిన్ డి క్లర్క్. దీంతో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

బౌలింగ్ లో 4 వికెట్లు ప‌డ‌గొట్టిన నాడిన్ డి క్లర్క్

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women)  మధ్య ఫైట్ జ‌రుగ‌గా, ఇందులో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించారు నాడిన్ డి క్లర్క్. బ్యాటింగ్ లో 60కి పైగా ప‌రుగులు చేయ‌గా, బౌలింగ్ లో ఏకంగా 4 వికెట్లు ప‌డగొట్టింది నాడిన్ డి క్లర్క్. 4 ఓవ‌ర్లు వేసి, కేవ‌లం 26 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చింది. ఇందులో 4 వికెట్లు ప‌డ‌గొట్టింది. దీంతో నాడిన్ డి క్లర్క్ పై ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఆర్సీబీ జ‌ట్టుకు మ‌రో ఏబీ డివీలియ‌ర్స్ దొరికింద‌ని అంటున్నారు. కాగా, నాడిన్ డి క్లర్క్ ది కూడా ద‌క్షిణాఫ్రికా అన్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాఫ్రికా బ్ల‌డ్ ఉన్న ప్లేయ‌ర్లు అంతా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టుకు బాగా ఆడుతున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×