E-Paper
Advertisement

Kaju Paneer Bhurji: చపాతీ, పుల్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్.. ఇంట్లోని పదార్థాలతో ‘కాజూ పనీర్ బుర్జీ’ తయారీ విధానం!

Kaju Paneer Bhurji: చపాతీ, పుల్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్.. ఇంట్లోని పదార్థాలతో ‘కాజూ పనీర్ బుర్జీ’ తయారీ విధానం!
Advertisement

Kaju Paneer Bhurji: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఏదైనా స్పెషల్ రెసిపీ చేసుకుని తినాలనిపిస్తే.. ఈ కాజూ పనీర్ బుర్జీ బెస్ట్ ఆప్షన్. బయట దొరికే పనీర్ కంటే.. ఇంట్లోనే పాలను విరగ్గొట్టి చేసే ఫ్రెష్ పనీర్ బుర్జీలో ఆ టేస్టే వేరు. వేడివేడి చపాతీలు లేదా పుల్కాల్లోకి ఈ కూర తింటుంటే.. కరకరలాడే జీడిపప్పు, సాఫ్ట్ పనీర్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!

కావలసిన పదార్థాలు:

ముందుగా అర లీటర్ పాలు, అరకప్పు జీడిపప్పు సిద్ధం చేసుకోండి. పాలు విరగగొట్టడానికి అర ముక్క నిమ్మకాయ ఉండాలి. వీటితో పాటు రెండు ఉల్లిగడ్డలు, రెండు టమాటాలు, అర కప్పు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోండి. ఇక తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు దగ్గర పెట్టుకోండి.

Advertisement

Also Read: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా.. ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, టేస్టీగా రావడం ఖాయం!

తయారు చేసే విధానం:

పాలను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు నిమ్మరసం పిండితే పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఆ విరిగిన పనీర్ నుండి నీళ్లన్నీ పూర్తిగా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీరను వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి, జీడిపప్పును దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి.

Advertisement

అదే నూనెలో జీలకర్ర వేసి, అది చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్దవేసి పచ్చి వాసన పోయే వరకు వేపి, ఆపై టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాక ముందుగా తయారు చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని దాంట్లో వేసి, తగినంత ఉప్పు కలిపి కాసేపు మూత పెట్టాలి. ఈలోపు ఒక చిన్న కప్పులో శనగపిండిని తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి.

ఈ శనగపిండి మిశ్రమాన్ని బాణలిలోని కూరలో చుట్టూ తిప్పుతూ పోయాలి. మిశ్రమమంతా కాస్త దగ్గర పడ్డాక, చివరగా వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా చల్లుకుని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆపేయండి. అంతే.. వేడివేడి ఇన్‌స్టంట్‌ కాజూ పనీర్‌ బుర్జీ తినడానికి రెడీ.

Also Read: నోరూరించే చింతచిగురు పచ్చి రొయ్యల ఇగురు.. ఇలా వండితే ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు!

 

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×