Sara Tendulkar : టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గత కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ ఇన్ స్టాలో అన్ ఫాలో కావడం.. బ్రేకప్ అయిందని వార్తలు కూడా వినిపించాయి. మరోవైపు మళ్లీ ఇద్దరూ కలిశారని.. వీరిపై రకరకాల రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? శుబ్ మన్ గిల్ ను కాదని సారా టెండూల్కర్ డిసెంబర్ 2025 క్రిస్మస్ వేడుకలు మరో వ్యక్తితో జరుపుకుంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Yash Dayal : RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ఓర్రీ (Orry) తో కలిసి సారా టెండూల్కర్ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. వీరిద్దరూ ఆంధేరిలోని సారా ఫిట్ నెస్ స్టూడియో “పిలేట్స్ అకాడమీ” (Pilates Academy) లో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వేడుకలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సారా టెండూల్కర్.. గిల్ ని పిచ్చొడిని చేసిందని.. అందుకే గిల్ ఈ మధ్య సరిగ్గా క్రికెట్ ఆడటం లేదని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ను పిచ్చోడిని చేసి.. వాడితో క్రిస్మస్ వేడుకలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారా టెండూల్కర్ ఏ పండుగ వస్తే.. ఆ పండుగ వాతావరణంలో ఉంటుంది. ఇటీవల సారా టెండూల్కర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. తల్లి అంజలితో కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆమె, కాశీ వీధుల్లో కలియతిరుగుతూ షాపింగ్ చేశారు. స్థానిక వంటకాలను ఆస్వాదించారు. తన యాత్రకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం అవి వైరల్ అయిన విషయం తెలిసిందే.
తన కాశీ యాత్ర ఎన్నో మధురానుభూతులను పంచిందని సారా తెలిపారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ ప్రసిద్ధి చెందిన బనారసీ చీరను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే, తిరంగా బర్ఫీ, దహీ వడ వంటి స్థానిక వంటకాలతో పాటు మట్టి కప్పులో టీ తాగడం వంటివి మర్చిపోలేని అనుభవాలని పేర్కొన్నారు. తాజాగా క్రిస్మస్ సంబురాల్లో పాల్గొంది. శుబ్ మన్ గిల్- సారా విడిపోయారంటూ చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు శుబ్ మన్ గిల్ సారా తో కాకుండా.. ఇతర నటీమణులతో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తనపై వస్తున్న రూమర్స్ పై గిల్ ఓ క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తి గత జీవితానికి సంబంధించి వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడాడు. తన పేరును ఇతర అమ్మాయిలతో ముడిపెట్టి రూమర్స్ క్రియేట్ చేశారని, వీరందరినీ ఎప్పుడూ చూడలేదు. తాను మూడు సంవత్సరాలకు పైగా ఒంటరిగానే ఉన్నానని.. తన దృష్టి మొత్తం పూర్తిగా వృత్తిపరమైన కెరీర్ పైనే ఉందని చెప్పాడు. అయినప్పటికీ గిల్ -సారా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Rohith-Virat : ‘సీసీటీవీల్లో రికార్డు చేశారా?’.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్
?igsh=MTI2YzNjZnJ6Ynp4Mg==