E-Paper
Advertisement

Yash Dayal : RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్

Yash Dayal : RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
Advertisement

Yash Dayal : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బౌల‌ర్ య‌శ్ ద‌యాల్ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నాడు. రాజ‌స్థాన్ కి చెందిన ఓ మైన‌ర్ బాలిక పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌ని పై కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న య‌శ్ ద‌యాల్ కి జైపూర్ పోక్సో కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను జైపూర్ పోక్సో కోర్టు కొట్టేసింది. విచార‌ణ కీల‌క ద‌శ‌లో ఉండ‌గా.. బెయిల్ స‌ముచితం కాద‌ని పేర్కొంది. క్రికెట్ లో స‌ల‌హాలు ఇస్తానంటూ హోట‌ల్ కి పిలిచి లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్టు రాజ‌స్థాన్ కి చెందిన ఓ అమ్మాయి య‌శ్ ద‌యాల్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో య‌శ్ ద‌యాల్ పై పోక్సో కేసు న‌మోదు చేశారు పోలీసులు.

Aslo Read : Kohli-Rohit: కోహ్లీ, రోహిత్ సెంచ‌రీలు..గంభీర్ కు హై బీపీ, ఆస్ప‌త్రి బెడ్ రెడీ అంటూ ! ?

య‌శ్ ద‌యాల్ కి ప‌దేళ్ల జైలు శిక్ష‌..?

Advertisement

ఈ కేసులో ఒక‌వేళ నేరం క‌నుక రుజువు అయితే మాత్రం య‌శ్ ద‌యాల్ కి దాదాపు ప‌దేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తొలుత త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు తెలిపింది. ఆ తరువాత క్రికెట్ లో మంచి కెరీర్ చూపిస్తాన‌ని న‌మ్మించి దాదాపు రెండేళ్ల పాటు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలు పోలీసుల‌కు చేసిన‌ ఫిర్యాదులో పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా జైపూర్ లో య‌శ్ ద‌యాల్ ని తొలిసారిగా క‌లిసిన‌ట్టు ఆమె వెల్ల‌డించింది. ఆ త‌రువాత క్రికెట్ స‌ల‌హాల పేరుతో హోట‌ల్ కి పిలిచి లైంగిక దాడి చేశాడ‌ని ఆరోపించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆ అమ్మాయి వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు కావ‌డంతో పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఈ కేసులో య‌శ్ ద‌యాల్ కి శిక్ష ప‌డేలా ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

 అత్యాచార ఆరోప‌ణ‌ల కేసులు..

మ‌రోవైపు గ‌తంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గాజియాబాద్ కి చెందిన ఓ యువ‌తి కూడా య‌శ్ ద‌యాల్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో అత‌నిపై కేసు న‌మోదు అయింది. ఈ కేసు పై అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. అరెస్ట్ పై అత‌నికి స్టే ల‌భించింది. 2022లో గుజరాత్ టైటాన్స్ త‌ర‌పున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ద‌యాల్. 2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు వ‌చ్చి కీల‌క బౌల‌ర్ గా మారాడు. ఆర్సీబీ త‌ర‌పున 13 వికెట్లు తీసి.. ట్రోఫీ విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ కేసులో అతను ఇప్పటికే 4 నెలల క్రితం UP T20 లీగ్ నుండి సస్పెండ్ అయ్యాడు. కానీ బీసీసీఐ అతడిని ఐపీఎల్ ఆడేందుకు అనుమతించడంతో ఆర్‌సీబీ అతడిని 5 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల విషయంలో ఏం జరుగుతుందో చూసిన తర్వాత కూడా అదే బీసీసీఐ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ ఆడేందుకు అనుమతించింది. నిజం చెప్పాలంటే బీసీసీఐ అత్యంత చెత్త క్రికెట్ బోర్డు అని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం విశేషం.

Advertisement

Also Read : Boxer Neeraj Goyat: ఇదెక్కడి సంతరా బూబా… ఓటమిని తట్టుకోలేక ఇండియ‌న్ బాంక్స‌ర్‌పై దాడి!

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×