Rohith-Virat : విజయ్ హజారే ట్రోఫీల్లో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ వారి ఆట చూడలేకపోయారు. తరువాత బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోల్లో క్వాలిటీ లేకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇది సీసీటీవీ ఫుటేజీనా..? 90S కెమెరాతో రికార్డు చేశారా..? అని ప్రశ్నించారు. నోకియా వీడియోలు ఇంతకన్నా మంచి క్వాలిటీతో ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో మరోసారి రెచ్చిపోయారు. ప్రధానంగా వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే సెంచరీలు చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకునేందుకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ పోటీ పడుతున్నారు.
Also Read : Smriti Mandhana-RCB: ఆర్సీబీ ఫ్యాన్స్ ను అవమానించిన స్మృతి మందాన..బ్యాన్ చేయాలంటూ రచ్చ ?
విజయ్ హజారే టోర్నమెంట్ లో ( Vijay Hazare Trophy Elite 2025-26) భాగంగా ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ 61 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. మొదట రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. అటు ఆంధ్రప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 83 బంతుల్లో సెంచరీ చేసి విరాట్ కోహ్లీ కూడా రెచ్చిపోయాడు. ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లీ బరిలో దిగగా.. అటు ముంబై తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరు టీమిండియా కీలక ఆటగాళ్లు వరుస సెంచరీలు చేయడంతో సోషల్ మీడియాలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ను దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిక్కింతో జరిగిన మ్యాచ్ లో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సిక్కిం బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్కిం పోటాపోటీగా కనిపించింది. కానీ రోహిత్ శర్మ వెళ్లిన తరువాత పరిస్థితి మారిపోయింది.
ముంబై ఛేజింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అంగ్క్రిష్ రఘువంశీ 65.52 స్ట్రైక్ రేట్‌తో 38 పరుగులతో ఓపికగా ఆడాడు. మరో ఎండ్ నుంచి రోహిత్ శర్మ మెల్లగా సెటిల్ చేసి మ్యాచ్‌పై పూర్తి బాధ్యతలు స్వీకరించాడు. సీనియర్ బ్యాటర్ పూర్తిగా నియంత్రణలో ఉన్నాడు. రోహిత్ 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేశాడు. వేగవంతమైన స్ట్రైక్ రేట్‌లో స్కోర్ చేశాడు. 62 బంతుల్లోనే 100 పరుగులు చేసి తన లిస్ట్ ఏ కెరీర్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. బెంగళూరు వేదికగా ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడ్డాయి. ఢిల్లీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 83 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ఆంధ్రా పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 131 పరుగులు చేశాడు. వీరిద్దరూ సెంచరీలు చేయడంతో 2027 వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తిరుగు లేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: Yash Dayal : RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
🚨 THE NUMBER 1 ODI BATTER SHOW IN JAIPUR 🚨
– Rohit Sharma in Vijay Hazare Trophy. 🤩 pic.twitter.com/iqf8uQFQOn
— Johns. (@CricCrazyJohns) December 24, 2025