Sara – Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (Indian Premier League 2025 Tournament )
చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో….శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) అలాగే సారా టెండూల్కర్ ( Sara Tendulkar) గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ ఇద్దరు నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సారా టెండూల్కర్ అలాగే శుభ్‌మన్ గిల్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో ( Instagramme) ఒకరినొకరు అన్ ఫాలో ( Un Follow) చేసుకున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Also Read: MI VS CSK: ప్రమాదంలో CSK.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న సారా, గిల్
శుభ్‌మన్ గిల్ టీమిండియాలోకి… వచ్చి దుమ్ము లేపుతున్న నేపథ్యంలోనే… అతనిపై సారా టెండూల్కర్ మనసు పడ్డట్లు సోషల్ మీడియాలో అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అటు సచిన్ టెండూల్కర్ కూతురు కావడంతో… ఆమెపై మనసు పడ్డాడట శుభ్‌మన్ గిల్. దీంతో ఇద్దరు రహస్యంగానే ప్రేమించుకున్నట్లు గత నాలుగు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి ముంబైలోని రెస్టారెంట్లు అలాగే హోటల్లు రకరకాల ప్లేస్లకు వెళ్లి ఎంజాయ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ సమయంలో కూడా…. ఆస్ట్రేలియాకు వెళ్లి మరి… శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చూసింది సారా టెండూల్కర్. దీంతో త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి.
అంతలోనే బ్రేకప్?
అయితే గత కొన్ని రోజులుగా సారా టెండూల్కర్ అలాగే శుభ్‌మన్ గిల్ గ్యాప్ పెరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన… మరో బ్యూటీతో శుభ్‌మన్ గిల్ కాస్త టచ్ లోకి వెళ్ళాడట. ఈ విషయం సారా టెండూల్కర్ కు తెలియడంతో…. వీళ్ళ బంధం క్లోజ్ అయిందని అంటున్నారు. మొదట శుభ్‌మన్ గిల్ కు బ్రేకప్ చెప్పింది సారా టెండూల్కర్ అని అంటున్నారు. ఇక తాజాగా ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Also Read: IPL 2025 : SRH లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.. బయటికి వెళ్ళాక దుమ్ము లేపుతున్నారు..
గిల్ – సారా బంధంలో పుల్లపెట్టిన అన్విత్ కౌర్ ( Avneet Kaur)
శుభ్‌మన్ గిల్ అలాగే సారా టెండూల్కర్ ప్రేమ బలంగా తయారవుతున్న నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్విత్ కౌర్ పుల్లపెట్టినట్లు తెలుస్తోంది. ఈమె మోజులో పడి… సారా టెండూల్కర్ ను దూరం చేసుకున్నాడట సుబ్రమణ్యం. ఆమెతో గత కొన్ని రోజులుగా చాలా క్లోజ్ గా ఉంటున్నాడట శుభ్‌మన్ గిల్. ఈ విషయం తెలియగానే… సారా టెండుల్కర్ బ్రేకప్ చెప్పినట్లు సమాచారం అందుతోంది.