IPL 2025 : ఐపీఎల్ సీజన్ ఈ సారి కొన్ని టీమ్ లు దుమ్ము రేపుతుంటే.. మరికొన్ని టీమ్ లు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. వీటిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గత సీజన్ లో ఫైనల్ వరకు వెళ్లి ఫైనల్ లో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. గత సీజన్ లో SRH తరపున బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అలాగే బౌలింగ్ లో కూడా ప్రతిభ కనబరిచారు. దీంతో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. SRH లో ఉన్న ఆటగాళ్లు కొందరూ గత సీజన్ లో ప్రతిభ కనబరచలేదు. దీంతో వారిని ఈ సీజన్ కి SRH తీసుకోలేదు.
వారిలో ముఖ్యంగా లక్నో ఓపెనర్ మార్క్ రమ్, లక్నో జట్టు ఆటగాడు అబ్దుల్ సమద్. వీరిద్దరూ గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఆడారు. ఆ సమయంలో వీరు బ్యాటింగ్ లో అంత ప్రతిభ కనబరచలేదు. అయితే ఈ సీజన్ కి వీరిద్దరినీ కూడా లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్ లో సమద్ 4 సిక్స్ లు కొట్టి లక్నో స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు సమద్. ఓపెనర్ మార్క్ రమ్ కూడా 45 బంతుల్లో 66 పరుగులు చేశాడు. వీరి ప్రతిభ చూసి సన్ రైజర్స్ హైదాబాద్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మా జట్టులో ఉన్నప్పుడు ఇలా ఆడలేదు. ఇప్పుడు లక్నో జట్టులోకి వెళ్లాక ఏంటి..? ఈ ప్రదర్శన అని బిత్తరపోవడం విశేషం. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 8 మ్యాచ్ లు ఆడితే.. 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. ఆ రెండింటిలో భారీ స్కోర్ చేయడం వల్లనే విజయం వరించింది. మిగతా మ్యాచ్ ల్లో హైదరాబాద్ అంతగా ప్రతిభ కనబరచకపోవడంతో ఓటమి పాలవుతోంది.
ఈ సీజన్ లో ఒక మ్యాచ్ లో బ్యాటర్లు ప్రతిభ కనబరిస్తే.. మరో మ్యాచ్ లో బౌలర్లు ప్రతిభ కనబరుస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ విఫలం చెందడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ ఉన్న మార్క్ రమ్, అబ్దుల్ సమద్ ని జట్టులోనే ఉంచుకుంటే ఈ సీజన్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చేవని కొందరూ అభిమానులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓపెనర్ గా మార్క్ రమ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా అబ్దుల్ సమద్ నిన్న జరిగిన మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరచడంతో వీరిపై సోషల్ మీడియాలో చర్చ జరగడం విశేషం.