BigTV English

Nagarjuna :నాగార్జున హలో బ్రదర్ కి 31 ఏళ్లు.. ఆ రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..?

Nagarjuna :నాగార్జున హలో బ్రదర్ కి 31 ఏళ్లు.. ఆ రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..?

Nagarjuna : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో కింగ్ గా, మన్మధుడుగా గుర్తింపు పొందాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. విక్రమ్ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తరువాత హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటించారు. 1989లో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ సినిమా గీతాంజలి నాగార్జునకు మంచి గుర్తింపు తెచ్చింది. 1994లో వచ్చిన హలో బ్రదర్ సినిమా యాక్షన్ కామెడీ చిత్రంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సినిమా గురించి అనేక విషయాలను తెలుసుకుందాం..


మొదటిసారి డబుల్ రోల్..

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కింగ్ నాగార్జున 1994లో హలో బ్రదర్ సినిమాలో డబుల్ రోల్ లో నటించారు. మొదటిసారి నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఇవివి సత్యనారాయణ సినిమాకు దర్శకత్వం వహించారు. కే నారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి సంగీతాన్ని కోటి అందించారు. ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ కలెక్షన్లను సాధించింది. రెండు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 8 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


సినిమా కథ ఒక నవల..

హలో బ్రదర్ సినిమా ఒక నవల ఆధారంగా తీశారు. నాగార్జున దేవా, రవి వర్మ అనే రెండు పాత్రలో నటించారు. ఇద్దరూ కమల పిల్లలుగా ఉన్నప్పుడే, విడిపోతారు. చిన్నప్పుడే హీరో తండ్రి ఒక బందిపోటు దొంగను అరెస్టు చేసే క్రమంలో చనిపోతాడు, అదే టైంకి హీరో తల్లి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఈ ఇద్దరు కవల పిల్లలు ఒకరు రౌడీగా, మరొకరు డాక్టర్ గా పెరుగుతారు. ఒకరు క్లాస్ పాత్రలో.. మరొకరు మాస్ పాత్రలో నటించారు. సినిమాలో ఇద్దరూ ఒకరికొకరు కలుసుకున్నప్పుడు, రమ్యకృష్ణ, నాగార్జున డైలాగ్స్ చెప్పినప్పుడు, ఒకరు చేసినట్టుగా మరొకరికి బాడీలో మార్పులు రావడం అనేది సినిమాలో కామెడీని హైలెట్ చేస్తాయి. ఈ సినిమా కామెడీ ప్రధాన అంశంగా నిర్మించారు.

కింగ్ అంటే ఆ మాత్రం వుంటుంది …

ఈ సినిమాలో బ్రహ్మానందం నాగార్జున కాంబినేషన్లో వచ్చే కామెడీ సన్నివేశాలు అన్నీ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కోటి అందించిన సంగీతం సూపర్. ఈ సినిమాలో ప్రతిపాట సినిమా విజయంలో ఒక కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన బొమ్మగా రికార్డు సృష్టించింది. 1994లో అత్యధికంగా వసూలు సాధించిన చిత్రంగా హలో బ్రదర్ నిలిచింది. ఆ తర్వాత నాగార్జున వరుస సినిమాలు చేసే సక్సెస్ ని అందుకున్నారు. శివ, మన్మధుడు, గీతాంజలి, అన్నమయ్య, శ్రీరామదాసు, దేవదాసు ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమా నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటినుండి ఆయన పేరు ముందు కింగ్ నాగార్జున గా పిలవడం మొదలుపెట్టారు అభిమానులు.ప్రస్తుతం నాగార్జున ధనుష్ కుబేర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతమంది హీరోలు వచ్చిన మన్మధుడు అంటే కింగ్ నాగార్జున అని, ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని అంటున్నారు అభిమానులు.

AR Rahman : ఎవరు బాధ్యులు.. AI మ్యూజిక్‌పై ఆస్కార్ విన్నర్ ఆవేదన

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×