Mega DSC Application Process: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎన్నో ఏళ్ల నుంచి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల సాకారం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ కి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి సర్కార్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో 259 పోస్టులు కాగా, జోనల్ స్థాయిలో 2 వేల పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నారు.
వీడియో విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం.. కూటమి సర్కార్ ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, టీచర్ పోస్టుల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాల గురించి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఓ వీడియో విడుదల చేశారు.
ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి..
అసలు మెగా డీఎస్సీకి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియను ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది వీడియో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పేర్కొన్నారు. ఈ వీడియోను చూసి ఈజీగా దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ అభ్యర్థుల్లారా..? టీచర్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అయితే.. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నంబర్ ఆఫ్ టైంస్ పుస్తకాలను రివిజన్ చేయండి. సిలబస్ ను రెండు, మూడు సార్లు రివిజన్ చేసేలా ప్లాన్ చేసుకోండి. మళ్లీ ఎప్పుడ నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఇంకెందుకు ఆలస్యం మిత్రులారా.. బాగా చదవండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..