E-Paper
Advertisement

Sara – Gill: గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సచిన్ కూతురు… ఒకరిపై ఒకరు పడుకుని మరీ !

Sara – Gill: గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సచిన్ కూతురు… ఒకరిపై ఒకరు పడుకుని మరీ !
Advertisement

Sara – Gill: తనదైన బ్యాటింగ్ స్కిల్స్, చార్మింగ్ పర్సనాలిటీతో శుభ్ మన్ గిల్ {shubman gill} భారత క్రికెట్ జట్టులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే నాలుగు ఇన్నింగ్స్ లలో 585 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక డబల్ సెంచరీ కూడా ఉన్నాయి.

Also Read: CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్

Advertisement

మరోవైపు అందంలో ఏమాత్రం బాలీవుడ్ హీరోకి తీసిపోని ఈ ప్లేయర్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంటుంది. సచిన్ టెండూల్కర్ కూతురితో గిల్ డేటింగ్ చేస్తున్నాడు అంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ కలిసి ముంబైలో ఓ రెస్టారెంట్ లో కెమెరాకి చిక్కడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఈ రూమర్స్ మరింత వ్యాపించాయి.

గిల్ క్లారిటీ:

Advertisement

సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నాడంటూ రూమర్స్ వైరల్ గా మారడంతో.. ఈ రూమర్స్ పై గిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు తాను ఎవరితో కూడా ప్రేమలో లేనని.. గత మూడు సంవత్సరాలుగా తాను సింగిల్ గానే ఉంటున్నానని స్పష్టం చేశాడు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ మాట్లాడుతూ.. ” నా విషయంలో అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఆ వార్తల్లో ఒక్కటి కూడా నిజం లేదు.

ఆ అమ్మాయితో, మరో హీరోయిన్ తో.. ఇలా ఎంతమందితో డేటింగ్ లో ఉన్నట్లు నాపై రకరకాల వార్తలు రాస్తున్నారు. నేను గత మూడు సంవత్సరాలుగా సింగిల్ గానే ఉంటున్నాను. నేను ఎవరితోనైనా ప్రేమలో పడితే ఖచ్చితంగా చెబుతాను. నేను ఇప్పటివరకు కలవని వ్యక్తులతో నాకు రిలేషన్ పెట్టి వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ ఫేక్ వార్తలను ఎవరు నమ్మకూడదు” అని గిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా గిల్ క్లారిటీ ఇవ్వడంతో కొంతకాలంగా అతడి పై రూమర్స్ ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి గిల్ పై ఇటువంటి రూమర్స్ నే వైరల్ చేస్తున్నారు.

గిల్ డ్రెస్సింగ్ రూమ్ లో సారా:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో గతంలో గిల్ కలకత్తా నైట్ రైడర్స్ {KKR} కి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా టెండూల్కర్ వచ్చిందని.. ఈ క్రమంలో వారు చేసిన ఓ రీల్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో గిల్ తో ఉన్న మరో ముగ్గురు.. ఒకరిపై ఒకరు పడుకొని రీల్ చేశారు.

Also Read: Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్ సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

గతంలో వీరు చేసిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. ఆ వీడియోలో ఉంది సారా టెండుల్ కాదని వాదిస్తున్నారు. ఇకనుండైనా గిల్ – సారా విషయంలో ఇటువంటి రూమర్స్ ని వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×