E-Paper
Advertisement

CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్

CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్
Advertisement

CSK – RCB: తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల జన్మదినం సందర్భంగా వారి సినిమాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి.. అభిమానుల ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ దిగ్గజ క్రికెటర్ వంతు వచ్చింది. అవును.. టీమిండియా మాజీ కెప్టెన్, తలా మహేంద్ర సింగ్ ధోనీ సమయం వచ్చింది.

Also Read: Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్ సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Advertisement

ధోని మూవీ రీ రిలీజ్:

జులై 7న మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు సందర్భంగా ” ఎం.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ” చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోలను హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మాత్రమే ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్ లో మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇక ధోని సినిమాని థియేటర్ లో వీక్షించేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ విరాట్ కోహ్లీ అభిమాని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} టీం కి సంబంధించిన విరాట్ కోహ్లీ 18 జెర్సీని ధరించి ధోని మూవీని వీక్షించేందుకు వచ్చాడు.

Advertisement

కోహ్లీ అభిమానిని చితకబాదిన ధోని అభిమానులు:

ఈ క్రమంలో ధోని – విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య తీవ్ర గర్షణ నెలకొంది. విరాట్ కోహ్లీ జెర్సీతో వచ్చిన అభిమానిని.. ధోని అభిమానులు చితకబాదారు. దీంతో ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ధోని సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ధోనీ తన చిన్నతనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని.. 2011 వరల్డ్ కప్ గెలిచే వరకు అతడి లైఫ్ జర్నీని తెరకెక్కించారు.

ఈ మూవీలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఈ మూవీలో అతడి సరసనకి కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు. ఈ చిత్రం అప్పట్లోనే రూ. 216 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. నిజానికి సీఎస్కే – ఆర్సీబీ అభిమానుల మధ్య గతేడాదే గొడవ మొదలైంది. ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 6 మ్యాచ్ లలో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ చేరింది.

Also Read: Campher – 5 wickets: 5 బంతుల్లో 5 వికెట్లు… ఐర్లాండ్ ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర

ఆ తర్వాత చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ సమయంలో ఆర్సిబి జట్టు ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. దీంతో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆర్సిబి ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో ఈ ఇరుజట్ల అభిమానుల మధ్య గొడవ అప్పటి నుండే ప్రారంభమైంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది.

?utm_source=ig_web_copy_link

Related News

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

Big Stories

Advertisement
×