BigTV English

Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్ సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Jadeja – Root: జడేజా కోతి చేష్టలు.. రూట్  సెంచరీ కాకుండా ఎలా అడ్డుకున్నాడో చూడండి.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే
Advertisement

Jadeja – Root: ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ సమానంగా ఉంది. ఈ మూడవ టెస్ట్ లో నెగ్గిన జట్టుకు సిరీస్ లో ఆదిక్యం లభించనుంది. ఈ క్రమంలో మూడవ టెస్ట్ కోసం ఇరుజట్లు పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగాయి. ఈ మూడవ టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


Also Read: Campher – 5 wickets: 5 బంతుల్లో 5 వికెట్లు… ఐర్లాండ్ ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర

అయితే మొదటి రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ నత్త నడకగా సాగింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ దూకుడైన ఆటతో పరుగులు రాబడుతుందన్న విషయం తెలిసిందే. కానీ ఈ మూడవ టెస్ట్ తొలి రోజు ఆ జట్టు 3.32 తో మాత్రమే పరుగులు చేయగలిగింది. 2022లో మెక్ కలమ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన 17 సందర్భాలలో.. తొలి సెషన్ లో ఆ జట్టు అతి తక్కువ రన్ రేట్ ఇదే.


ఇక ప్రస్తుతం క్రీజ్ లో జో రూట్ {99*}, బెన్ స్టోక్స్ {39*} ఉన్నారు. భారత బౌలింగ్ లో తొలిరోజు నితీష్ కుమార్ రెడ్డికి రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, బుమ్రా కి చెరో వికెట్ లభించింది. తొలి రోజు ఆటలో ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. వీరిద్దరూ కలిసి 31 ఓవర్లు వేసినప్పటికీ.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. అంతేకాకుండా ఆకాష్ దీప్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టడంతో.. టీమిండియా కి కాస్త బ్రేక్ వచ్చింది. లేదంటే తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు హవానే కొనసాగేలా కనిపించింది. ఇక తొలి రోజు జో రూట్ 191 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేశాడు.

జడేజా – రూట్ మధ్య ఫన్నీ సన్నివేశం:

రూట్ 99 పరుగుల మధ్య ఉండగా.. రవీంద్ర జడేజా – రూట్ మధ్య ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. తొలి రోజు చివరి ఓవర్ లో రూట్ తన 37వ సెంచరీ పూర్తి చేస్తాడని అంతా భావించారు. ఈ క్రమంలో రూట్ 98 పరుగుల వద్ద ఉండగా.. చివరి ఓవర్ ని ఆకాశ్ దీప్ వేశాడు. ఆ చివరి ఓవర్ నాలుగవ బంతిని లెంగ్త్ డెలివరీ వేయగా.. క్రీజ్ లో ఉన్న రూట్ బ్యాక్వర్డ్ వైపు తరలించి సింగిల్ తీశాడు. ఆ తర్వాత రెండవ పరుగు కోసం ప్రయత్నించడంతో.. అప్పటికే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా చేతిలోకి బంతి వెళ్ళింది.

Also Read: Watch Video: లేడీ గెటప్ లో విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ ను ఫుట్ బాల్ లాగా తన్నేశాడుగా

దీంతో స్టోక్స్.. “రెండవ పరుగు వద్దు” అని చెప్పడంతో రూట్ ఆగిపోయాడు. ఆ సమయంలో జడేజా.. బంతిని కింద పడేసి పరుగు తీసుకో అని సూచించాడు. దీంతో రూట్ నవ్వుతూ ముందుకు వెళ్లబోగా.. జడేజా వెంటనే బంతిని మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో రూట్ వెనక్కి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న క్రీడాభిమానులంతా కేకలు వేస్తూ రూట్ సెంచరీ పూర్తయిందని భావించారు. కానీ అతడు 99 పరుగుల వద్ద ఆగిపోవలసి వచ్చింది.

?utm_source=ig_web_copy_link

Related News

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

Big Stories

×