E-Paper
Advertisement

బాల్ టాంప‌రింగ్ చేస్తూ మ‌రోసారి దొరికిన షాహీన్ అఫ్రిది…షూల‌తో తొక్కుతూ మ‌రీ

బాల్ టాంప‌రింగ్ చేస్తూ మ‌రోసారి దొరికిన షాహీన్ అఫ్రిది…షూల‌తో తొక్కుతూ మ‌రీ
Advertisement

Shaheen Afridi Ball Tampering :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఒక వైపు జరుగుతుండగా మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. మూడు రోజుల కిందట ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అనేక రకాల వింత సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. పాకిస్తాన్ బౌలర్లు స్పిన్నర్ లాగా బౌలింగ్ చేయడం.. క్యాచులు వదిలివేయడం, చెత్త ఫీల్డింగ్ చేయడం లాంటి సంఘటనలు ఇప్పటికే వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi ) మరోసారి బాల్ టాంపరింగ్ (Ball Tampering Controversy) వ్యవహారంలో చిక్కుకున్నట్లు ఆ వీడియో బయటకు వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో తన ఓవర్ మధ్యలో, బంతిని కాలితో తొక్కాడు షాహీన్ అఫ్రిది. ఈ క్రమంలో బంతి ఆకారం మారిందని అంపైర్లు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో బాల్ టాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

బాల్ టాంప‌రింగ్ చేస్తూ మ‌రోసారి దొరికిన షాహీన్ అఫ్రిది

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan, 1st Test ) మధ్య ఢాకా వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి, మొదటి ఇన్నింగ్స్ లో 413 పరుగులు సాధించింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 386 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసిన బంగ్లాదేశ్ 120 పరుగుల లీడ్ సంపాదించింది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోగా… మరో గంట తర్వాత మ్యాచ్ షురూ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ గా చెప్పుకునే షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) మరోసారి బాల్ టాంపరింగ్ వ్యవహారంలో చిక్కుకున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రిది.. బంతిని కాలితో తొక్కాడు. ఆకారం మారిపోయేలా ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న అంపైర్లు పసిగట్టి.. వెంటనే బంతిని తీసుకున్నారు. బంతి ఆకారం మారిందా ? లేదా ? అని చెక్ చేశారు. అయితే బంతి ఆకారం మారకపోవడంతో షాహిన్ అఫ్రిది బతికి బయటపడ్డాడు. లేకపోతే అతడి పైన బ్యాన్ కచ్చితంగా పడేదని అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా షాహీన్ అఫ్రిది, కూడా బాల్ టాంప‌రింగ్ వ్య‌వ‌హారంలో చిక్కుకున్నాడు.

Advertisement

 

 

 

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

 

 

 

 

Related News

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Big Stories

Advertisement
×