Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతోన్న నేపథ్యంలో ఎక్కువగా డబ్బులు ఇచ్చే ఐపిఎల్ లోకి చాలా మంది క్రికెటర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ నుంచి.. ఐపీఎల్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికి కూడా కొంత మంది ప్లేయర్లు రకరకాల కారణాలు చెప్పి, PSL నుంచి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ క్రికెటర్లు వెళ్లిపోతున్నారని ఎవరు టెన్షన్ పడవద్దు.. ఒకవేళ PSL ప్లేయర్ల కొరత ఏర్పడితే తాను కూడా ఆడతానని వెల్లడించారు. 50 సంవత్సరాల వయసులో కూడా క్రికెట్ ఆడగల సత్తా తనలో ఉందని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు షాహిద్ అఫ్రిది.
Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్కడ స్టేడియాలపైనే బాంబులు పడతాయి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ఒప్పందం చేసుకున్న చాలామంది విదేశీ క్రికెటర్లు జారుకుంటున్నారు. PSL ప్రారంభం నుంచి ఇప్పటివరకు చాలామంది ప్లేయర్లు వైదొలిగారు. కొంతమంది ఐపిఎల్ లోకి వెళితే.. మరికొంతమంది జాతీయ జట్టుపై ఫోకస్ చేశారు. అయితే ఈ క్రమంలో షాహిద్ అఫ్రిది సంచలనం ప్రకటన చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును కాదని వెళ్లిపోయే విదేశీ క్రికెటర్లను బతిలాడకూడదని కోరారు.
పోయేవాడిని ఎవరు ఆపవద్దని వెల్లడించారు. ఒకవేళ ఈ టోర్నమెంట్లో క్రికెటర్ల కొరత ఏర్పడితే తాను రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని..PSL ఆడతనని ప్రకటించారు. ఇప్పటినుంచి మరో ఆరు సంవత్సరాల పాటు ఆడే సత్తా తనకు ఉందని వెల్లడించారు. వాస్తవంగా తన వయసు 50 సంవత్సరాలు అయినప్పటికీ.. తన సర్టిఫికెట్ల ప్రకారం 42 సంవత్సరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును కాపాడేందుకు ఎంతటికైనా తెగిస్తానని స్పష్టం చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
PSL నుంచి బ్లెస్సింగ్ ముజారాబాని, శనక, స్పెన్సర్ జాన్సన్, మోటీ, బ్రూక్, గుర్భాజ్, డేవిడ్ వీస్ లాంటి ప్లేయర్లు రకరకాల కారణాల వల్ల వైదొలిగారు. పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ నబీ, ముజీబ్ లాంటి క్రికెటర్లు కూడా జంప్ అయ్యారు. కొంత మంది పాకిస్తాన్ లో సేఫ్టీ లేదని కూడా వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో విదేశీ క్రికెటర్లకు భరోసాను ఇస్తూనే PSL ను కాపాడే ప్రయత్నం చేసారు షాహిద్ అఫ్రిది.
Also Read: Ahmed Shehzad: PSLలో వార్నర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయర్లు తప్ప, ఎవడూ మిగలలేదు
Many foreign players are leaving the PSL because of poor management and security issues. Because of this, the league is slowly losing big and famous cricketers.
In this situation, former Pakistan captain Shahid Afridi has come forward. He said that if there are not enough star… pic.twitter.com/DcMgWJVc0X
— Saffron Chargers (@SaffronChargers) April 16, 2026