E-Paper
Advertisement

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Advertisement

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రమాణ స్వీకారం అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. “తెలంగాణ ప్రజల సమస్యల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు హక్కుల గురించి పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వం తరపున గట్టిగా పోరాటం చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల సందడి నెలకొంది. తన ఆహ్వానం మేరకు ఢిల్లీకి తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లడం వల్ల, కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వానికి మరింత బలం చేకూరినట్లయింది. అభిషేక్ మను సింఘ్వీ వంటి జాతీయ స్థాయి నేతతో కలిసి ఆయన సభలో అడుగుపెట్టడం విశేషం.

Read Also: ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×