E-Paper
Advertisement

ఫైనల్ స్టేజ్‌లో ఏఐసీసీ పదవుల ప్రాసెస్.. నేడో రేపో జీవో జారీ..!

ఫైనల్ స్టేజ్‌లో ఏఐసీసీ పదవుల ప్రాసెస్.. నేడో రేపో జీవో జారీ..!
Advertisement

Nominated Posts: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకుంది. పార్టీ కోసం కష్టపడిన క్యాడర్, సీనియర్ నాయకులకు ‘గుడ్ న్యూస్’ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.నామినేటెడ్ పదవుల భర్తీ కొరకు సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నాటరాజన్, టీపీసీసీ చీఫ్​ లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు పదవుల భర్తీపై డిస్కషన్ చేశారు. జిల్లాలు, సామాజిక న్యాయం, పార్టీ కోసం పనిచేసిన నేతలు..ఇలా లిస్టును ఫిల్టర్ చేశారు. ఆశావహుల ఒక్కో పేరుపై ప్రత్యేకంగా డిస్కషన్ చేసినట్లు తెలిసింది.’ఒకరికి ఒకటే పదవి’అనే సూత్రాన్ని పాటిస్తూనే, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 40కి పైగా కార్పొరేషన్లు, ప్రభుత్వ సలహాదారుల పోస్టుల కోసం వందలాది దరఖాస్తులు రాగా, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితర వాటిని వడపోసి అత్యంత కీలకమైన 20 నుంచి25 పదవులను మొదటి విడతలో భర్తీ చేయాలని ఫిక్స్ అయ్యారు.ఇక కేవలం ప్రభుత్వ పదవులే కాకుండా, పార్టీలో ఖాళీగా ఉన్న జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ పదవులను కూడా ఒకేసారి భర్తీ చేయడం ద్వారా అసంతృప్తికి తావులేకుండా చూడాలని అధిష్టానం భావిస్తోంది.

రెండు, మూడు రోజుల్లోనే జీవోలు..

ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల భర్తీపై రెండు మూడు రోజుల్లోనే జీవోలు రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం సచివాలయ వర్గాలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. పార్టీకి విధేయులుగా ఉండి, ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికే ఈసారి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.అయితే పదవుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు రావడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. గాంధీ భవన్ చుట్టూ, మంత్రుల నివాసాల చుట్టూ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు ఈ దఫా పదవి వచ్చేలా అవకాశం చూపాలని ప్రాధేయపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు కావోస్తుందని, కానీ ఇప్పటికీ తమకు పదవి రాకపోతే ఎలా? అంటూ కొందరు మంత్రుల సన్నిహితులు సున్నితంగానే ప్రశ్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేల ఫాలోవర్స్ లిస్టు కూడా పెద్దగానే ఉన్నదని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే, రెడ్డి వర్గంలోని కీలక నాయకులను సంతృప్తి పరచడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం 30 శాతం మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీలోని ఖాళీ పదవులు కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నది.

Advertisement

Also read: ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదే!

కీలక స్ట్రాటజీ..?

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లోపే నామినేటెడ్ పదవులు, ప్రభుత్వంలోని పోస్టులను భర్తీ చేసి ముందుకు సాగాలనేది సర్కార్ ఆలోచన. ఈ పదవుల భర్తీ ద్వారా కింది స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపవచ్చని పార్టీ కూడా భావిస్తుంది. అంతేగాక గత కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న పదువుల ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా పార్టీలో అంతర్గత విమర్శలకూ చెక్ పెట్టవచ్చు.మరోవరైపు ప్రభుత్వ పాలన, పార్టీ యాక్టివిటీస్ స్పీడప్ అవుతాయి. ముఖ్యంగా కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగితే, ఆయా సంస్థల ద్వారా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పదవులు ద్వారా గ్రౌండ్ లెవల్ లో పార్టీ పటిష్టంగా ఏర్పడుతుంది. తద్వారా ఎన్నికల్లో సులువుగా విజయం సాధించవచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉన్నది.

Advertisement

Also Read: పేరుకే పెద్ద కమెడియన్..చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశానంటూ ఎమోషనల్!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×