Shahid Afridi: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ మరియు బాబర్ ఆజం ల మధ్య ఎవరు అత్యుత్తమ బ్యాటర్ అనే చర్చ తరచూ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ బ్యాటర్ అనే చర్చ ఆధునిక క్రికెట్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం. అయితే ఈ ఏడాది గణాంకాలు మరియు తాజా ఫామ్ ని పరిశీలిస్తే మాత్రం ఇద్దరు తమదైన శైలిలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్, అత్యధిక పరుగులు, క్లిస్ట పరిస్థితితులలో మ్యాచ్ లను గెలిపించే నైపుణ్యంతో బాబర్ ఆజం కంటే ముందున్నాడు. ఇక బాబర్ ఆజం విషయానికి వస్తే.. ఇతడు వేగంగా పరుగులను సాధిస్తూ.. కోహ్లీ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.
Also Read: బ్యాట్ విరగ్గొట్టిన షాహిన్ అఫ్రిది.. బ్యాన్ విధించేందుకు PCB రంగం సిద్ధం
గత కొంతకాలంగా బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టి-20 క్రికెట్ లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా బాబర్ వేగంగా ఆడలేక పోతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ లో కూడా బాబర్ 126.15 స్ట్రైక్ రేటు తో మాత్రమే పరుగులు చేస్తున్నాడు. కానీ విరాట్ కోహ్లీ మరియు బాబార్ అజామ్ లలో ఒకరిని ఎంచుకోవలసి వస్తే తాను మాత్రం బాబర్ ఆజం ని ఎంచుకుంటానని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.
విరాట్ కోహ్లీ మరియు బాబర్ ఆజం లలో ఒకరిని ఎంచుకోవలసి వస్తే తాను బాబర్ అజామ్ ని ఎంచుకుంటానని చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. బాబర్ అజామ్ క్లాస్, స్థిరత్వం మరియు ప్రదర్శనల కారణంగా నేను ఈ నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. అలాగే ఓ గొప్ప ఆటగాడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు బాబర్ ఆజం లో ఉన్నాయని పేర్కొన్నాడు షాహిద్ అఫ్రీది. అయితే గతంలో షాహిద్ అఫ్రిది.. బాబర్ అజామ్ ని విరాట్ కోహ్లీ తో పోలుస్తూ.. బాబర్ ఇంకా మ్యాచ్ విన్నర్ గా తనను తాను నిరూపించుకోవాలని, కోహ్లీ లాగా మ్యాచ్ లను ముగించడం కూడా నేర్చుకోవాలని సూచించాడు. అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉండగా.. పాకిస్తాన్ క్రికెట్ లో బాబర్ ఆజం కెప్టెన్సీ మరియు ప్రదర్శన పై విమర్శలు వస్తున్న తరుణంలో ఆఫ్రిది.. బాబర్ కి మద్దతుగా నిలిచాడు.
Also Read: ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం.. ఇక ఐపీఎల్ లో వాడికి ఒక్క వికెట్ పడదు.. రాసి పెట్టుకోండి
ఇక విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2026 లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 173.21 స్ట్రైక్ రేట్ తో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాకుండా తన స్ట్రైక్ రేట్ ని పెంచుకుంటూ జట్టుకు వేగంగా విజయాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల పట్ల భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీకి.. బాబర్ ఆజం కి పోలిక ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.facebook.com/share/p/1De78oe2xY/