E-Paper
Advertisement

ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం.. ఇక ఐపీఎల్ లో వాడికి ఒక్క వికెట్ పడదు.. రాసి పెట్టుకోండి

ఫర్హాన్ దెబ్బకు బుమ్రా కెరీర్ నాశనం.. ఇక ఐపీఎల్ లో వాడికి ఒక్క వికెట్ పడదు.. రాసి పెట్టుకోండి
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2026) లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. కట్టుదిట్టంగా బంతులు వేసి బ్యాటర్లను బెంబేలెత్తించే బుమ్రా.. ఈ ఐపిఎల్ సీజన్ లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇప్పటివరకు ఇతడు ఆడిన ఐదు మ్యాచ్ లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా 8.63 ఎకానమీతో 164 పరుగులు సమర్పించాడు. ఇది బుమ్రా కెరీర్ లోనే సుదీర్ఘ వికెట్ లేని గ్యాప్ గా నిలిచింది. జట్టు కష్టాలలో ఉన్న సమయంలో ఆదుకునే బుమ్రా.. ఇప్పుడు ఇలా అవ్వడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో బుమ్రా ఫామ్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: బ్యాట్ విరగగిట్టిన షాహిన్ అఫ్రిది.. బ్యాన్ విధించేందుకు PCB రంగం సిద్ధం

Advertisement

 

బుమ్రా పని అయిపోయింది:

ఈ సీజన్ లో బుమ్రా ప్రదర్శన పై స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. “బుమ్రా పని అయిపోయింది (he is finished). అతడిలో పూర్వపు పదును తగ్గింది. ప్రస్తుతం ఒక సాధారణ బౌలర్ గా మారిపోయాడు” అని ఎద్దేవా చేశాడు. అంతేకాకుండా 2025 ఆసియా కప్ లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ కారణంగానే బుమ్రా కెరీర్ దెబ్బతిందని చెప్పుకొచ్చాడు. ” 2025 ఆసియా కప్ (ASIA CUP 2025) లో పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్.. బుమ్రా బౌలింగ్ లో వరుస సిక్సర్లు బాదాడు. ఆ మ్యాచ్ లో ఫర్హాన్ ఎదురుదాడి చేయడంతోనే బుమ్రా కెరీర్ దెబ్బతింది. అప్పటినుండే అతడు బౌలింగ్ పై పట్టు కోల్పోయాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆసియా కప్ లో బుమ్రా పై ఫర్హాన్ 34 బంతుల్లో 51 పరుగులు చేసి రికార్డు సృష్టించడం గమనార్హం.

Advertisement

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

 

తన్వీర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీమిండియా ఫ్యాన్స్ :

బుమ్రాపై తన్విర్ అహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. బుమ్రా త్వరలోనే మళ్లీ తన ఫామ్ ని అందుకుంటాడని, ఐపీఎల్ ఫామ్ ని బట్టి ఒక దిగ్గజ బౌలర్ ని ఇలా తక్కువగా అంచనా వేయలేమని సోషల్ మీడియాలో కౌంటర్స్ ఇస్తున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే.. బుమ్రా ఫామ్ పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశాడు. పవర్ ప్లే లో ఇతర బౌలర్లు తగినంత ఒత్తిడి సృష్టించకపోవడం వల్లే బుమ్రాకు వికెట్లు దక్కడం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. అలాగే బుమ్రా తన ఫామ్ ని తిరిగి పొందేందుకు బౌలింగ్ కోచ్ లసిత్ మలింగా పర్యవేక్షణలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా యార్కర్లు మరియు వేగంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడంపై దృష్టి పెట్టాడు.

?utm_source=ig_web_copy_link

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×