Shivam Dube Hairstyle: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st T20I ) మధ్య నిన్న మొదటి టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ శివమ్ దూబే కొత్త లుక్ లో (Shivam Dube Hairstyle ) కనిపించాడు. గతంలో ఫుల్ హెయిర్ తో కనిపించిన శివమ్ దూబే… నిన్న చిన్నపిల్లాడిలా కనిపించాడు. స్కూలుకు వెళ్లే పిల్లాడు కటింగ్ చేయించుకున్నట్లుగా తన హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు శివమ్ దూబే. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st T20I ) మధ్య నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ( Vidarbha Cricket Association Stadium, Nagpur) జరిగిన మొట్ట మొదటి టీ20 మ్యాచ్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబే కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించారు. ఈ సందర్భంగా స్కూల్ కు వెళ్లే బుడ్డోడు కటింగ్ చేయించుకున్నట్లుగా తన హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు శివం దుబాయ్. అంతేకాదు చిన్నతనంలో పిల్లలకు తల్లి దువ్వెనతో దుస్తు.. స్కూలుకు పంపిస్తుంది. అప్పుడు పిల్లలు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారు. అయితే నిన్నటి మ్యాచ్ సందర్భంగా శివమ్ దూబే ( Shivam Dube) కూడా అలాగే కనిపించి మెరిశాడు. పాలు తాగే బుడ్డోడిలా కనిపించాడు. ఈ ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ కావడంతో శివమ్ దూబే హెయిర్ స్టైల్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టే శివమ్ దూబే, తల్లి పాలు తాగే బుడ్డోడిలా మారిపోయాడు ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టి20 లో మనోళ్లు బోణి కొట్టారు. న్యూజిలాండ్ పై మొదటి టి20 లో 48 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిoడియా. ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి, 238 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పోరాడి ఓడిపోయింది న్యూజిలాండ్. 20 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ ఓడిపోవలసి వచ్చింది. ఈ ఐదు టి20 సిరీస్ లో 1-0 తేడాతో లీడింగ్ లోకి వచ్చింది ఇండియా. ఇక రేపు రెండు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రాయ్ పూర్ వేదికగా జరుగనుంది.
What happened to Shivam Dube's hairs suddenly bro ?? 😭 #indvsnzt20 pic.twitter.com/6v1enfblY5
— Prince 🥑 (@meri_mrziii) January 21, 2026
Shivam Dube hairstyle 😭#indvsnzt20 pic.twitter.com/2X1GW8O2Pr
— 💙 (@Alreadysad__) January 21, 2026