E-Paper
Advertisement

జేబులో బాంబులా పేలిన స్మార్ట్‌ఫోన్.. షాకింగ్ వీడియో చూస్తే ఇక జేబులో ఫోన్ పెట్టరు!

జేబులో బాంబులా పేలిన స్మార్ట్‌ఫోన్.. షాకింగ్ వీడియో చూస్తే ఇక జేబులో ఫోన్ పెట్టరు!

Phone Explosion: స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఇది మన శరీరంలో ఒక భాగమైపోయింది. అయితే, అదే ప్రాణంగా చూసుకునే మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబులా పేలితే? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! సరిగ్గా ఇలాంటి వెన్నులో వణుకు పుట్టించే ఘోర ప్రమాదం ఒకటి రాజస్థాన్‌ వేదికగా వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటనతో ప్రస్తుతం జనాలు తమ జేబుల్లో ఉన్న ఫోన్లను చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ జోధ్‌పూర్ పరిధిలో ఉన్న మండోర్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అక్కడ రోజు వ్యాపారం తో  బిజీగా ఉండే ఒక స్థానిక వ్యాపారి గోపాల్ సోని (39) ఎప్పటిలాగే తన దుకాణంలో పనుల్లో మునిగిపోయాడు. తన మొబైల్ ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని, మార్కెట్ పని చూసుకుంటూ అలా నిలబడ్డాడు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అతని జేబులోని స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. పేలుడు సంభవించిన మరుక్షణమే అతని ప్యాంట్ జేబులోంచి దట్టమైన పొగలు బయటకు రావడం ప్రారంభమైంది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ రూమ్ మొత్తం చీకటిగా మారేలా దట్టమైన పొగ వ్యాపించింది.

తృటిలో తప్పిన ప్రమాదం 

జేబులోనే నిప్పు అంటుకోవడంతో మంటల ధాటికి తీవ్రంగా గాయపడిన అతను నొప్పితో పెద్ద పెట్టున కేకలు వేశాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వ్యాపారులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అతను తీవ్ర గాయాలతో విలవిలలాడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని రక్షించారు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తృటిలో తప్పిందని, ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు చెప్పడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇక పేలుడు సమయంలో ఫోన్ 87% ఛార్జింగ్‌తో ఉందని తెలుస్తుంది.

also read :నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆలయ ఏనుగు వీడియో.. ఏం చేసిందంటే?

సీసీటీవీ కెమెరాలో  రికార్డయిన దృశ్యాలు 

అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో  స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ సీసీఫుటేజ్ కాస్తా నెట్టింట్లో  ప్రత్యక్షం కావడంతో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ప్యాంట్ జేబులోంచి పొగలు రావడం, ఆ వ్యాపారి ప్రాణభయంతో అల్లాడిపోవడం చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ జేబుల్లో ఉన్న ఫోన్లను తీసి పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఫోన్ వాడాలంటేనే జనాలు ఇప్పుడు జంకుతున్నారు.

ఇందుకు కారణం ఏంటంటే 

ఈ ఘటనపై సాంకేతిక నిపుణులు స్పందిస్తూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాతావరణంలోని వేడికి తోడు, జేబులో ఉంచడం వల్ల ఫోన్ అతిగా వేడెక్కి (Overheating) ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. లేదా ఆ మొబైల్ బ్యాటరీలో తయారీ పరంగా ముందే ఉన్న ఏదైనా సాంకేతిక లోపం (Technical Glitch) కానీ, షార్ట్ సర్క్యూట్ కానీ ఇందుకు కారణం కావచ్చని పేర్కొంటున్నారు.

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక హెచ్చరిక

ఈ నేపథ్యంలో మొబైల్ వాడేవాళ్ళు  కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్లను ప్యాంట్ జేబుల్లో లేదా నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంచకూడదు. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడటం, గేమ్స్ ఆడటం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఫోన్ విపరీతంగా వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే దాన్ని వాడటం ఆపేసి, కాసేపు పక్కన పెట్టడం మంచిది. అలాగే లోకల్ బ్యాటరీలు, డూప్లికేట్ చార్జర్లను వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి, ఒరిజినల్ కంపెనీ పరికరాలనే వాడాలని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా జోధ్‌పూర్ ఘటన మాత్రం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒక హెచ్చరిక లాంటిదేనని చెప్పాలి.

also read :బట్టలు విప్పితేనే రొమాన్సా? ‘పెద్ది’ డైరెక్టర్‌కు జయా బచ్చన్, కరీనా కపూర్ గట్టి కౌంటర్!

Related News

నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆలయ ఏనుగు వీడియో.. ఏం చేసిందంటే?

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

లక్ అంటే ఇదేనేమో! సామాన్య కూలీ ఖాతాలోకి ₹294 కోట్లు.. ఆ తర్వాత జరిగిన ట్విస్ట్ మామూలుగా లేదుగా!

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

లిఫ్ట్ అడిగింది.. ఫోన్ కొట్టేసింది.. సీన్ కట్ చేస్తే నడిరోడ్డుపై ఊహించని ట్విస్ట్..వైరల్ వీడియో !

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

×