E-Paper
Advertisement

Shoaib Akhtar : మ‌రో వంద‌ జ‌న్మ‌లు ఎత్తినా, వైభ‌వ్ లాగా బాబ‌ర్ ఆజం ఆడ‌లేడు

Shoaib Akhtar : మ‌రో వంద‌ జ‌న్మ‌లు ఎత్తినా, వైభ‌వ్ లాగా బాబ‌ర్ ఆజం ఆడ‌లేడు
Advertisement

Shoaib Akhtar :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( vaibhav suryavanshi) పేరు మారుమోగుతోంది. మొన్న ముంబై ఇండియన్స్ పై అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్య వంశీ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు కొట్టడం అమోఘం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. అతని చూసి బాబర్ ఆజం బుద్ధి తెచ్చుకోవాలని మండిపడ్డారు. ప్రతి మ్యాచ్ లో 250 స్ట్రైక్ రేట్ సాధిస్తున్నాడని.. అలాగే బాబర్ కూడా ఆడాలని కోరారు అక్త‌ర్‌. దీంతో అక్త‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

 మ‌రో వంద‌ జ‌న్మ‌లు ఎత్తినా, వైభ‌వ్ లాగా బాబ‌ర్ ఆజం ఆడ‌లేడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా లాంటి బౌలర్లను కూడా చీల్చి చెండాడుతున్నాడని వెల్లడించారు. తొలి బంతికే సిక్సర్లు కొట్టి చుక్కలు చూపించాడని ప్రశంసించారు. మరో 100 జన్మలు ఎత్తిన కూడా వైభవ్ సూర్యవంశీ లాగా బాబర్ ఆజం ఆడలేడని చురకలు అంటించారు.

అయినప్పటికీ బాబర్ ఆజంను ఇంకా ఎందుకు కింగ్ అని పిలుస్తారు..? కొంచమైనా బుద్ధి ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా బాబర్ ఆజంలో మార్పు రావడంలేదని నిప్పులు చెరిగారు. 15 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ప్రతి మ్యాచ్ లో 250 కి పైగా స్ట్రైక్ రేటుతో వైభవ్ సూర్యవంశీ ఇరగదీస్తున్నాడని గుర్తు చేశారు. కానీ పాకిస్తాన్ కింగ్ బాబర్ ఆజం మాత్రం డకౌట్లు అవుతున్నాడని సెటైర్లు పేల్చారు.

వైభవ్ సూర్యవంశీ పై త‌న్వీర్ అహ్మ‌ద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన ( vaibhav suryavanshi) మాజీ క్రికెటర్లు అందరూ ప్రశంశల వర్షం కురిపిస్తుంటే త‌న్వీర్ అహ్మ‌ద్ మాత్రం అతని ఏజ్ ను కించపరుస్తూ మాట్లాడారు. వైభవ్ సూర్య వంశీ  ( vaibhav suryavanshi) పెద్ద మోసగాడని, వయసు విషయంలో అబద్ధాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్. వైభవ్ సూర్య వంశీ వయసు 21 నుంచి 25 మధ్యలో ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ దీన్ని దాచిపెట్టి, వైభవ్ అందరిని మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై కచ్చితంగా ఐసిసి చర్యలు తీసుకోవాలని కోరారు. వెంట‌నే వైభ‌వ్ సూర్య వంశీకి అన్ని టెస్టులు చేసి, నిజం తేల్చాల‌ని డిమాండ్ చేశారు త‌న్వీర్‌ ( Tanveer ahmed).

 

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×