E-Paper
Advertisement

వందే భారత్ ను మించి.. గంటకు 220 కి.మీ హై స్పీడ్ ట్రైన్స్!

వందే భారత్ ను మించి.. గంటకు 220 కి.మీ హై స్పీడ్ ట్రైన్స్!
Advertisement

220KM High Speed Trains: భారత్ లో వందే భారత్ హై స్పీడ్ రైళ్లకు స్టార్టింగ్ పాయింట్ అయితే.. రైల్వే ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భారతీయ రైల్వే లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా ఉంది. ఇప్పటి వరకు, దేశవ్యాప్తంగా 81 జతల వందే భారత్ రైలు చైర్ కార్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ డిజైన్ ను మరింత అప్డేట్ చేస్తూ.. గంటకు 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా రెండు కొత్త రైళ్లను నిర్మించే ప్రణాళికలు చేస్తుంది రైల్వే శాఖ. వందే భారత్ ను దాటి ముందుకు వెళ్లేందుకు భారతీయ రైల్వే సన్నద్ధమవుతోందని సమాచారం.

రూ.866 కోట్ల ప్రాజెక్టు

రైల్వే బోర్డు గత నెలలో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) జనరల్ మేనేజర్‌కు రాసిన లేటర్ లో 2027-28 నాటికి రెండు 16-కార్ల బ్రాడ్ గేజ్ రైలు సెట్లను రూపొందించాలని తెలిపింది. ఈ స్టీల్ బాడీ రైళ్లు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించాలని సూచించింది. ఇండియన్ రైల్వేస్ లో నెక్ట్స్ జనరేషన్ రైళ్లకు అక్టోబర్ 2024లోనే పునాది పడింది. ఎనిమిది బోగీలు గల రెండు హై-స్పీడ్ రైలు సెట్ల డిజైన్, తయారీ కోసం ICF, BEMLకు ఒక కాంట్రాక్టును ఇచ్చింది.

Advertisement

ప్రతి రైల్ కార్ ధర రూ. 27.86 కోట్లుగా నిర్ణయించడంతో, మొత్తం ఒప్పంద విలువ రూ. 866.87 కోట్లగా ఉంది. ఈ మొత్తంలో డిజైన్ ఖర్చులు, డెవలప్మెంట్ ఖర్చులు, ఛార్జీలు, జిగ్‌లు, ఫిక్చర్‌లు, టూలింగ్, టెస్టింగ్ సౌకర్యాలపై చేసే ఖర్చులన్నీ ఉంటాయని పేర్కొంది.

గంటకు 220 కి.మీ

కొత్త ప్రాజెక్ట్ లో రెండు రేక్‌లను బ్రాడ్ గేజ్ రైలు సెట్లుగా తయారు చేయనున్నారు. ఒక్కో రేక్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లు స్టీల్ బాడీతో డిజైన్ చేయనున్నారు. వీటి డిజైన్ వేగం గంటకు 220 కిలోమీటర్లు, గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉండనుంది.

Advertisement

Also Read: సమ్మర్ ట్రావెలర్స్ కు గుడ్ న్యూస్.. 1,484 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×