E-Paper
Advertisement

Shoaib Akhtar: PSL ఆడ‌కుండా పారిపోయిన దుర్మార్గుల‌పై 5 ఏళ్లు బ్యాన్ వేయాలి

Shoaib Akhtar: PSL ఆడ‌కుండా పారిపోయిన దుర్మార్గుల‌పై 5 ఏళ్లు బ్యాన్ వేయాలి
Advertisement

Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League Tournament) పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League ) విజయవంతంగానే కొనసాగుతోంది. ఇక ఈ సారి కూడా ఈ టోర్నమెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వేలం కూడా నిర్వహించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీన ప్రారంభం కానుంది. అంటే ఐపీఎల్ కంటే రెండు రోజుల ముందుగానే ప్రారంభం అవుతోంది. మే మూడవ తేదీన ఈ టోర్నమెంట్ ముగిస్తుంది. అంటే దాదాపు 40 రోజులపాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు రంగంలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొనే జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడకుండా అర్ధాంతరంగా పారిపోయే ప్లేయర్లపై ఐదు సంవత్సరాల పాటు వ్యాన్ ( PSL Ban) విధించాలని డిమాండ్ చేశారు షోయబ్ అక్తర్.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

PSL ఆడ‌కుండా పారిపోయిన దుర్మార్గుల‌పై 5 ఏళ్లు బ్యాన్ ?

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఒప్పందం కుదుర్చుకొని అర్ధాంతరంగా తప్పుకుంటున్న విదేశీ ప్లేయర్లపై కఠినంగా వ్యవహరించాలని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న హ్యారీ బ్రూక్ పైన రెండు సంవత్సరాల పాటు బీసీసీఐ బ్యాన్ విధించినట్లు గుర్తు చేశారు. అచ్చం అలాగే పాకిస్తాన్ సూపర్ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న ప్లేయర్లపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. అప్పుడే టోర్నమెంట్ మధ్యలో వెళ్లిపోయే దుర్మార్గులకు కఠిన శిక్ష పడుతుందని పేర్కొన్నారు. లేకపోతే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరించారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి పెట్టాలని కోరారు.

PSL ఆడ‌కుండా పారిపోయిన ప్లేయ‌ర్లు వీళ్లే

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ఈ మధ్యకాలంలో ఒక్కో విదేశీ ప్లేయర్ తప్పుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఆఫర్ వస్తే కొంతమంది బయటకు వెళ్తుంటే.. దేశ పరిస్థితిల నేపథ్యంలో ఆఫ్గానిస్తాన్ ప్లేయర్లు కూడా వైదొలిగారు. తాజాగా జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజారాబాని ( Blessing Muzarabani) ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడతానని చెప్పి… వైదొలిగాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో కేకేఆర్ జట్టుకు ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ కూడా తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా మొదట లాహోర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. జాతీయ జట్టుపై ఫోకస్ చేసేందుకుగాను తప్పుకుంటున్నట్లు మరో ప్రకటన చేశాడు. గుడాకేష్ మోతీ ( Gudakesh Motie) కూడా ఇటీవల లాహోర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకొని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అయ్యే దశలో తప్పుకున్నాడు. ఇతను కూడా ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుసగా ఒక్కో విదేశీ ప్లేయర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల బ్యాన్ వేయాల‌ని కోరుతున్నారు.

Advertisement

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×