Shreyas Iyer – RJ Mahvash: టీమిండియా స్టార్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డ్ లో… చాలా యాక్టివ్ గా ఉండే యుజ్వేంద్ర చాహల్ జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారిపోయింది. తన మొదటి భార్య ధనశ్రీ వర్మ కు విడాకులు ఇచ్చిన… మరో అమ్మాయితో యుజ్వేంద్ర చాహల్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ప్రస్తుతం రిలేషన్షిప్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. RJ మహ్వాష్ అనే అమ్మాయిని.. పంజాబ్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో స్టార్ ఆటగాడు యుగేంద్ర చాహల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
శ్రేయాస్ అయ్యర్ తో తిరుగుతున్న చాహల్ లవర్ RJ మహ్వాష్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… మొన్న మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కీలకమైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒకే ఒక్క పరుగు చేయడంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ దెబ్బకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ ఓడిపోయిన తర్వాత ప్లేయర్లు అందరూ కలిసి చిన్నపాటి పార్టీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ తో కాస్త క్లోజ్ గా కనిపించింది RJ మహ్వాష్. శ్రేయస్ అయ్యర్ తో కూడా ఫోటోలు దిగింది. శ్రేయస్ అయ్యర్ చెల్లెలు పేరుతో.. అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ చాహల్ లేకపోవడంతో… విచ్చలవిడిగా ఫోటోలు కూడా దిగిందని సమాచారం అందుతుంది. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఈ RJ మహ్వాష్ ఫోటోలను చూసిన నెటిజెన్స్, క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొదట్లో ధనశ్రీ వర్మతో డాన్సులు చేసి… శ్రేయస్ అయ్యర్ రచ్చ చేశాడని… ఇక ఇప్పుడు కొత్త ప్రియురాలు RJ మహ్వాష్ తో కూడా… దగ్గరవుతున్నాడని.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చాహల్ కు శ్రేయస్ అయ్యర్… అన్యాయం చేస్తున్నాడని కూడా మండిపడుతున్నారు. వెంటనే చాహల్ తేరుకోవాలని.. లేకపోతే… కొత్త పిల్ల RJ మహ్వాష్ కూడా పోతుందని అంటున్నారు.
ధనశ్రీ కి విడాకులు ఇచ్చిన చాహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు ధనశ్రీ వర్మ అలాగే చాహల్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా… దాదాపు నాలుగు కోట్లకు పైగా… భరణం ఇచ్చాడు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ కు వచ్చేసాడు చాహల్. అటు ధనశ్రీ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా తీస్తోంది.