BigTV English

Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

Vijay Mallya: భారతదేశవ్యాప్తంగా ప్రస్తుతం విజయ్ మాల్యా గురించి చర్చ జరుగుతుంది. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడంతో… విజయ్ మాల్యా ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ మాల్యా పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుతో ఒక్కసారిగా హార్ట్ టాపిక్ అయ్యారు విజయ్ మాల్యా. ఇండియాకు సంబంధించిన బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని.. లండన్ పారిపోయాడని విజయ్ మాల్యా పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు నేటిజన్స్.


లోన్లు కట్టేసిన కూడా విజయ్ మాల్యాపై ట్రోలింగ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇతర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టి ఇండియా బదిలీ లండన్ పారిపోయాడని విజయ్ మాల్యా…పై దారుణంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టు చేస్తారన్న భయంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయాడని ఇప్పటికి కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదం పై తాజాగా విజయ్ మాల్యా స్పందించారు. తాను రుణాలు తీసుకున్నది నిజమే.. దేశం వదిలి లండన్ వెళ్లాను.. దీంతో నన్ను పారిపోయిన దొంగ అని పిలవడం మొదలు పెట్టారని ఎమోషనల్ అయ్యారు.


తనపై దొంగ ముద్ర వేయకండి అని కోరారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే 2016 సంవత్సరంలో తాను ఇండియా నుంచి విదేశాలకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇండియన్ వదలాల్సి వచ్చిందని వెల్లడించారు. కానీ లండన్ వెళ్లిన తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఇండియాకు రాలేకపోయానని స్పష్టం చేశారు విజయ్ మాల్యా. ఇండియాలో తనకు గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇస్తే మళ్లీ ఇండియాకు వస్తానని కూడా ప్రకటించారు. తొమ్మిది సంవత్సరాలలో మొదటిసారి రుణాలు తిరిగి చెల్లించడం జరిగిందన్నారు.

కింగ్ ఫిషర్ కల్లోలంపై విజయ్ మాల్యా హాట్ కామెంట్స్

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పునర్నిర్మాణ ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించినట్లు గుర్తు చేశారు. తాను చాలా సమస్యల్లో ఉన్నట్లు కూడా ప్రణబ్ ముఖర్జీకి వివరించినట్లు తెలిపారు విజయ్ మాల్యా. అందుకు గాను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించాలని అలాగే ఉద్యోగులను తొలగించాలని భావించినట్లు అప్పుడే ప్రకటించినట్లు వివరించారు. కానీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోకుండా ఉండాలని ప్రణబ్ ముఖర్జీ సూచించినట్లు వెల్లడించారు. బ్యాంకుల నుంచి మద్దతు లభిస్తుందని ప్రథమ ముఖర్జీ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అనంతరం ఆర్థిక ఇబ్బందుల వల్ల దేశాన్ని విడాల్సి వచ్చిందని వెల్లడించారు.

“Oo La La La Le O ” Jingle వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

కింగ్ ఫిషర్ లోగోను 1996 సంవత్సరంలోనే వెస్టిండీస్ జెర్సీపై వహించినట్లు విజయ్ మాల్యా ఈ సందర్భంగా తెలిపారు. వెస్టిండీస్ జట్టు సభ్యులు… పాటలు పాడినా లేదా డాన్స్ చేసినా బాగుంటుందని వెల్లడించారు. అదే సమయంలో “Oo La La La Le O ” Jingle అనే స్లోగన్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. అది కూడా వెస్టిండీస్ క్రికెటర్లతో…“Oo La La La Le O ” Jingle అనిపించడంతో… కింగ్ ఫిషర్ మరింత పాపులారిటీ దక్కించుకుందని విజయ్ మాల్యా వెల్లడించారు.

?igsh=aTN0NTQ5aTlhbDFs

Related News

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Ravichandran Ashwin : అశ్విన్ రిటైర్మెంట్… CSKకు 10 కోట్ల లాభం… రంగంలోకి కాటేరమ్మ కొడుకు?

Romario Shepherd: ఒక్క బాల్‌కు 22 రన్స్.. RCB ప్లేయర్ అరాచకం

Mark Wood : రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం నా వల్ల కాదు.. ఇంగ్లాండ్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×