Aha Sarkaar 5.. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఎప్పటికప్పుడు సరికొత్త షో లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. సుధీర్ షో అంటే కచ్చితంగా నవ్వులు గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అనేలా.. తాజాగా ఆయన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఒక షో చేస్తున్నారు. ఆ షో పేరే సర్కార్ సీజన్ 5(Sarkar Season 5).. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ 5 షో సంబంధించి ఇప్పటికే రెండు, మూడు ప్రోమోలు వచ్చి షో పై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా ఆహా ఓటీటీ లో సర్కార్ సీజన్ 5కి సంబంధించి నిన్న అనగా జూన్ 6న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది.ఇకపై సర్కార్ సీజన్ 5 అనే షో ప్రతి శుక్రవారం ఆహా ఓటీటీ (Aha OTT)లో రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ఇలాంటి షోలలో ఎంతోమంది హీరోయిన్లు, కమెడియన్లు వచ్చి సోలో సందడి చేస్తూ ఉంటారు.
సర్కార్ సీజన్ 5 లో ఇంటి నుండి పాల్గొనే అవకాశం..
అయితే తాజాగా సర్కార్ సీజన్ 5 గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ సర్కార్ సీజన్ 5 షో లో ఇంట్లో నుండే పాల్గొనవచ్చట. కేవలం సెలబ్రిటీలే కాదు మామూలు జనాలు కూడా ఇందులో పాల్గొనవచ్చట. మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న సర్కార్ సీజన్ 5 అనే షోలో ఇంట్లో నుండి పాల్గొనే ఒక అవకాశాన్ని కల్పించారు. మరి ఇంట్లో నుండి ఎలా ఆడవచ్చంటే.. సర్కార్ సీజన్ 5 షోలో ఒక సరికొత్త సెగ్మెంట్ ని తీసుకువచ్చారు.ఈ సెగ్మెంట్లో సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే మామూలు జనాలు కూడా పాల్గొనవచ్చు.అది కూడా ఇంట్లో నుండే.. ఆహా ఓటీటీ లో సర్కార్ సీజన్ 5 షో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో డిస్ప్లే మీద ఒక క్యూ ఆర్ కోడ్ ని పెడతారు.
Also read: Dhoom -4: బాలీవుడ్ బాట పట్టిన టాలీవుడ్ స్టార్స్.. నిన్న ఎన్టీఆర్.. నేడు ఎవరంటే?
ఆడడమే కాదు సర్ప్రైజింగ్ గిఫ్ట్ లు కూడా..
ఆ క్యూఆర్ కోడ్ ని ఇంట్లో నుండి గేమ్ ఆడాలని ఆసక్తి ఉన్నవాళ్లు ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. అయితే ఆ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఎవరైతే సరైన సమాధానాలు చెబుతారో వారికి సర్ప్రైజింగ్ గిఫ్టులు ఆహా వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. అలా ఇంట్లో నుండే ఆహా ఓటీటిలో స్ట్రీమింగ్ అయ్యే సర్కార్ సీజన్ 5 నుండి షో వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి సర్ప్రైజింగ్ గిఫ్టులు అందుకోవచ్చు.. అయితే ఆహా వాళ్ళు ఈ సరికొత్త సెగ్మెంట్ ని తీసుకురావడానికి కారణం సర్ప్రైజింగ్ గిఫ్టుల కోసమైనా సరే చాలామంది ఈ షోని చూస్తారు.అలా షో చూడడం వల్ల వారికి రేటింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరి ఇంకెందుకు లేటు ఆహా ఓటీటిలో స్ట్రీమింగ్ అయ్యే సర్కార్ సీజన్ 5 షో చూడండి సర్ప్రైజింగ్ గిఫ్టులు గెలుచుకోండి.