Sharayu Kulkarni- Pant: టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జైంట్స్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల సెంచరీ చేసిన తర్వాత చేసిన సెలబ్రేషన్స్ మళ్ళీ తెరపైకి వచ్చాయి. అచ్చం రిషబ్ పంత్ తరహాలోనే… మరో మహిళా క్రికెటర్ సెలబ్రేషన్స్ చేసుకొని… అతని గుర్తు చేసింది. అచ్చం రిషబ్ పంత్ తరహాలో జంపింగ్ చేసి అందరిని మైమరిపించింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… నెటిజెన్స్.. షాక్ అయిపోతున్నారు. ఓ మహిళ క్రికెటర్ ఇలా జంప్ చేయడం ఏంటని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Criminal Franchise: RCBకి కొత్త జెర్సీ… కోహ్లీకి ఖైదీ డ్రెస్… ఆడుకుంటున్న చెన్నై ఫ్యాన్స్ !
రిషబ్ పంత్ ను మరిపించిన మహిళా క్రికెటర్
మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ పూర్తికాగానే క్రికెట్ హవా మొత్తం తగ్గిపోయింది. త్వరలోనే టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈనెల 20వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025 ఇప్పుడు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో జరిగిన ఓ సంఘటన హాట్ టాపిక్ అయింది.
ఈ టోర్నమెంట్ లో… లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తరహాలో.. ఓ మహిళ క్రికెటర్ ఎంజాయ్ చేసింది. డేంజర్ ప్లేయర్ స్మృతి మందాన వికెట్ తీసిన అనంతరం… మహిళా క్రికెటర్ సరయు కులకర్ణి.. ఓ రేంజ్ లో రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అచ్చం రిషబ్ పంత్ తరహా లోనే.. ఆమె జంపింగ్ చేసి.. సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఉమెన్స్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్… టోర్నమెంట్ లో ఈ సంఘటన జరిగింది. ఇక ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు అలాగే నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
సెంచరీ తర్వాత రిషబ్ పంత్ సెలబ్రేషన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో అత్యంత దారుణంగా విఫలమైన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంత్ మాత్రమే. 27 కోట్లు పెట్టి లక్నో కొనుగోలు చేస్తే ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు రిషబ్ పంత్. కానీ చివర్లో ఎలిమినేట్ అయిన తర్వాత.. ఓ మ్యాచ్లో మాత్రం సెంచరీ చేశాడు రిషబ్ పంత్. అది కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన సెంచరీ చేశాడు. ఈ సెంచరీ చేసిన తర్వాత గాల్లో ఎగురుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు రిషబ్ పంత్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అతని తరహాలోనే తాజాగా.. సరయు కులకర్ణి (Sarayu kulkarni) కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Sharayu Kulkarni in WMPL celebrated in Rishabh Pant style after dismissing Smriti Mandhana.
– Global Star Rishabh Pant ❤️🐐 pic.twitter.com/nywJKxc5bR
— RP17 Gang™ (@RP17Gang) June 6, 2025